రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన విజ‌య‌సాయి రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 05:07:16

రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన విజ‌య‌సాయి రెడ్డి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో  తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజ‌నా చౌద‌రిపై విరుచుకుప‌డ్డారు. కేంద్రంలో ఉన్న సంకీర్ణ‌ప్ర‌భుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగ‌స్వామిగా ఉంద‌ని, ఈ క్ర‌మంలో ఏపీకి న్యాయం చేయాల‌ని కేంద్రాన్ని కోర‌టం సిగ్గుచేట‌ని   సాయి రెడ్డి అన్నారు. 
 
కేంద్రం నిర్ణ‌యంపై ఓ కేంద్ర మంత్రి మ‌రో కేంద్ర మంత్రికి స‌భా సాక్షిగా సూచ‌న‌లు ఇవ్వ‌డం స‌రైన‌దేనా అని ప్ర‌శ్నించారు. కేంద్రంలో ఉన్నటీడీపీ ఎవ‌రిని న్యాయం అడుగుతోంద‌ని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ఆందోళ‌న‌లు చేస్తుందా... అని  అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని  పేర్కొన్నారు 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిజంగా  మీరు న్యాయం  చేయాల‌ని  కోరుతున్న‌ట్ల‌యితే  ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడాల‌నుకుంటే  వెంట‌నే కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి అప్పుడు న్యాయం కోరాల‌ని  విజ‌య‌సాయి రెడ్డి సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.