బాబుకు సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 04:20:19

బాబుకు సూటి ప్ర‌శ్న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైకాపా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి  విరుచుకుప‌డ్డారు.త‌న త‌ప్పుల‌ను క‌ప్పిప్పుచ్చుకొనేందుకు చంద్ర‌బాబు  కేంద్ర ప్ర‌భుత్వంపై నెడుతున్నార‌ని,  నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతున్నా.. మౌనం వహిస్తూ ఉన్న బాబు ఇప్పుడు ఒక్కసారిగా ఏం ఆశించి పోరాడుతున్నారో చెప్పాలని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉండిపోయారని ఆయన  సూటిగా ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు రాద్ధాంతం చేశారని విమ‌ర్శించారు.  ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నది కేవలం వైకాపా మాత్రమే అని విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే వైసీపీ ఎంపీలు పోరాడారంటూ  టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఇలా కౌంట‌ర్ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.