త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 11:04:52

త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తా....

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. వైసీపీ త‌ర‌పున డిల్లీలో రాజ‌కీయాలు తిప్పుతున్న ఆయ‌న తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్నారు. పార్ల‌మెంట్ బ‌య‌టా....లోప‌లా... టీడీపీ నేత‌ల బండారాల‌ను బ‌య‌ట‌పెడుతూ వ‌స్తున్నారు. 
 
కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉండి బ‌డ్జెట్ ను ఆమోదించిన టీడీపీ ఎంపీ సుజ‌నా చౌదరి  ఇప్పుడు ఏ విధంగా  పార్ల‌మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తార‌ని విజ‌య‌సాయి  రెడ్డి  నిల‌దీశారు.  టీడీపీ ప్ర‌భుత్వ తీరుతో పాటు ఏపీ ప‌రిస్ధితుల‌ను  తెలియ‌జేసేందుకు విజ‌య‌సాయి  రెడ్డి రాష్ట్రప‌తి రామ్ నాధ్ కోవింద్ ను క‌ల‌వ‌డం జ‌రిగింది. 
 
ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై రాష్ట్ర‌పతి ద‌గ్గ‌ర ప్ర‌స్తావించారు విజ‌య‌సాయి రెడ్డి.  రాజ్య‌స‌భ  ఎన్నిక‌ల్లో గెలిచేందుకు మ‌ళ్లీ వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు  చేసేందుకు  టీడీపీ ఎంపీ టీజీ  వెంక‌టేష్ బేర‌సారాలు చేస్తున్నార‌ని  ఆయ‌న  మండిప‌డ్డారు.
 
త‌మ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు సుమారు  రూ. 20 కోట్లు  ఆఫ‌ర్లు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి టీజీ వెంక‌టేష్ బాగోతాన్ని  బ‌య‌ట‌పెడతామ‌ని విజ‌య‌సాయి  రెడ్డి ప్ర‌క‌టించారు.  కేంద్ర ప్ర‌భుత్వం  విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న  అమలు చేయని అంశాల‌ను రాష్ట్రప‌తి దృష్టికి తీసుకెళ్లామ‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే క్ర‌మంలో అంద‌రినీ క‌లుస్తామ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.