విజ‌య‌సాయిరెడ్డి అదిరిపోయే పంచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mp vijaya sai reddy and chandrababu naidu
Updated:  2018-05-15 18:02:10

విజ‌య‌సాయిరెడ్డి అదిరిపోయే పంచ్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు సంఘీభావంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి విశాఖప‌ట్నంలో పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు.ఈ  పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా విశాఖ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఈ సంఘీభావ యాత్ర‌లో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు విజ‌యసాయి రెడ్డి.
 
తాజాగా విశాఖ పట్టణంలోని దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్రలో ఆయన మాట్లాడుతూ, మ‌రో సారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పై అలాగే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌న‌పై విజ‌య‌సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. 
 
2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాజ‌ధాని నిర్మ‌ణం పేరుతో నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జా ధ‌నాన్ని అక్షారాలా మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లను టీడీపీ నాయ‌కులు అక్ర‌మంగా విదేశాల‌కు త‌ర‌లిస్తున్న‌రాని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌ద్దారు.
 
అయితే ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అవినీతిలో కూరుకు పోయింద‌ని ఈ అవినీతికి అడ్డుక‌ట్ట వేయాలంటే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌చ్చితంగా ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తన పాద‌యాత్ర‌లో విశాఖ ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను త‌న‌కు వివ‌రిస్తున్నారని విజ‌యసాయి రెడ్డి తెలిపారు.
 
ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ వైసీపీ నాయ‌కుల కంటే ప్ర‌జ‌లే తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై ఎంతో ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఎప్పుడెప్పుడు జ‌రుగుతాయా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు త‌మ ఓటుతో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.
 
అలాగే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమ‌ని ఎవ‌రైతే ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా ప్ర‌క‌టిస్తారో వారికే వైసీపీ  మ‌ద్ద‌తు తెలుపుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ ల‌క్ష్యం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ని అందుకోసం ఎందాకైనా పోరాడుతామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్రబాబు ఒక దొంగ అని, ఈ  దొంగ ఎక్కడ దాక్కున్నా, దొంగ దొంగే అవుతారు కానీ మంచోడుకార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.