జ‌మిలి ఎన్నిక‌ల‌కు ష‌ర‌తుల‌తో వైసీపీ గ్రీన్ సిగ్న‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 17:52:01

జ‌మిలి ఎన్నిక‌ల‌కు ష‌ర‌తుల‌తో వైసీపీ గ్రీన్ సిగ్న‌ల్

జ‌మిలి ఎన్నిక‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున సానుకూల‌మే అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే దానితో ముడిప‌డి ఉన్న స‌మ‌స్య‌ల‌ను, ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రిస్తేనే తాము ముందుకు వెళ్ల‌గ‌ల‌మని ఆయ‌న తెలిపారు. జ‌మిలి ఎన్నిల‌క‌ల‌తో ఉన్న లాభాలు, న‌ష్టాల‌ను వివ‌రిస్తూ తొమ్మిదిపేజీల నివేదిక‌ను వైఎస్సార్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి లా క‌మిష‌న్ కు అంద‌జేశారు. 
 
అదే స‌మ‌యంలో 1951 నుంచి 1967 వ‌ర‌కు అలాగే 1999 నుంచి 2014 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి లోక్ స‌భ‌కు ఏక కాలంతో ఎన్నిక‌లు జ‌రుగుతున్న విధానాన్ని విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌స్తావించారు. జ‌మిలి ఎన్నికల కార‌ణంగా త‌లెత్తే ప‌రిణామాలను సంపూర్ణంగా స‌మ‌గ్రంగా పరిష్క‌రించి ఆ మేర‌కు రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌ చేయాల‌ని సూచించారు. 
 
జ‌మిలి ఎన్నిక‌ల  విష‌యంలో ఏకాభిప్రాయానికి రావాల‌ని అప్పుడే స‌వాల్లు ప్ర‌తీ కూల‌త‌ల‌ను అధిగమించ‌గ‌ల‌మ‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌మ అభిప్రాయాల‌ను నిషితంగా పరిసీలించి దేశ ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జాస్వామ్యం కోసం స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని లా క‌మిష‌న్‌ను విజ‌య‌సాయి రెడ్డి కోరారు. ఈ ఎన్నిక‌లు జ‌రిగితే క‌ర‌ప్ష‌న్, త‌గ్గుతుందని అలాగే ఓటుకు నోటు కేసు లాంటి కేసులు రావ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
అలాగే రాజ్య‌స‌భ డిప్యూటి చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తాము గ‌తంలో చెప్పామ‌ని ఇప్పుడు కూడా చెబుతున్నామ‌ని రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఏ పార్టీ  ప్ర‌క‌టిస్తుందో ఆ పార్టీకి వైసీపీ స‌పోర్ట్ చేస్తుంద‌ని విజ‌యసాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
కొద్దిరోజుల క్రితం బీజేపీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన విష‌యాల‌ను పూర్తిగా అమ‌లు చేశామ‌ని కోర్టులో అఫిడ‌విట్ దాక‌లు చేసిందో అది వైసీపీకి వ్య‌తిరేకం క‌నుక రాజ్య‌స‌భ డిప్యూటి చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.