ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-16 18:05:15

ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

ఏపీ రాజ‌కీయాలు ప‌లు కీల‌క మ‌లుపులు తిరుగుతున్నాయి... ఇటు ప‌వ‌న్ ప్లీన‌రీ త‌ర్వాత ప‌వన్ కు తెలుగుదేశానికి మ‌ధ్య వార్ మ‌రింత పెరిగింది... ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఇటు తెలుగుదేశం ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్తితుల్లో బీజేపీ మైండ్ గేమ్  అనుకుని, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ అవిశ్వాస తీర్మానానికి కాకుండా తామే తీర్మానం ప్ర‌వేశ పెడ‌తాం అని తెలియ‌చేశారు - ప్ర‌వేశ పెట్టారు.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో ఏ రాజకీయ పక్షానికైనా మద్దతు ఇచ్చేందుకు వెనుకాడబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి స్పష్టం​చేసింది. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి చెబుతున్నట్లే.. హోదా అంశంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని, రేపటి టీడీపీ తీర్మానానికి కూడా అనుకూలంగా ఓటేస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. స‌భ వాయిదా త‌ర్వాత ఆయ‌న ఈ విష‌యాన్ని తెలియ‌చేశారు.
 
సీఎం చంద్ర‌బాబు నేర‌గాడే అయినా తాము అవిశ్వాస తీర్మానానికి స‌పోర్ట్ చేస్తాము అని అన్నారు..దేశంలో చంద్రబాబును మించిన రాజకీయ- ఆర్థిక- సామాజిక నేరగాడు లేనేలేడు. ప్రజల రక్తాన్ని పీల్చుకున్న ఆయన.. తాను దోచిన ధనాన్ని విదేశాలకు తరలించాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు వక్రీకరించడంలో దిట్ట. మాటపై నిలబడలేని, అసలు విశ్వసనీయత అంటేనే తెలియని జీవి అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.. పోటో చిట్ట‌చివ‌ర‌కి మా దారిలోకి వ‌చ్చారు వెంట‌నే అవిశ్వాస తీర్మానం పెడ‌తాం అని ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు అన అన్నారు ఆయ‌న‌. ఏపీకి మేలు చేసే ఏ తీర్మానానికి అయినా తాము మ‌ద్ద‌తు ఇస్తాం అని తెలియ‌చేశారు విజ‌య‌సాయిరెడ్డి..
 
ఇక 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను నిసిగ్గుగా తెలుగుదేశంలో చేర్చుకున్నారు ఇది రాజ‌కీయాల్లో ఎంత దారుణం తాము ఎన్నోసార్లు రాజీనామాలు చేయాల‌ని కోరాం బాబు ఆ ప‌ని చేయ‌లేదు..తాను ప్ర‌ధానిని క‌లిస్తే  త‌ప్పు ఏమిటి ఏపీకి ఎటువంటి సాయం కావాలి అన్నా ప్ర‌ధానిని కలుస్తాం ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌ధానిని క‌లిస్తే ఇంత యాగీ చేస్తారా అని ప్ర‌శ్నించారు ఆయ‌న‌. నాలుగేళ్లుగా బాబు పాల‌న చూస్తున‌నారు కాబ‌ట్టే తెలుగుదేశం అధినేత‌కు నాయ‌కుల‌కు ఎంపీల‌కు ప్ర‌ధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు అని విజ‌య‌సాయిరెడ్డి తేల్చిచెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.