12 గంట‌ల్లో రాజీనామా చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:08:31

12 గంట‌ల్లో రాజీనామా చేస్తా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు న‌మ్మ‌క ద్రోహం,కుట్ర‌రాజ‌కీయాలు,  వంటి వాటిని ప్ర‌స్తావిస్తూ  గ‌త కొద్ది రోజులుగా టీడీపీ నాయ‌కులు ధ‌ర్మ‌పోరాట దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో విశాఖ‌ప‌ట్నంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో మ‌రోసారి ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ను టీడీపీ నాయ‌కులు ఏర్పాటు చేశారు.
 
ఇక ఈ దీక్ష‌లో చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న కుమారుడు లోకేశ్ ఇద్ద‌రు క‌లిసి కేంద్రం పై దుమ్మెత్తిపోశారు. దీంతో పాటు ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులపై  కూడా విమ‌ర్శించారు. తాము నిర్వ‌హిస్తున్న ప్ర‌తీ కార్య‌క్ర‌మాని వైసీపీ నాయ‌కులు అడ్డుప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేశారు. 
 
ఇక తాజాగా చంద్ర‌బాబు నాయుడు చేప‌ట్టిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి విశాఖ ప‌ట్నంలోని వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీని నిర్వ‌హించారు. ర్యాలీలో విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో చంద్ర‌బాబు కేంద్రంతో మిత్రప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి రెండు నాలుక‌ల దోర‌ణిలాగా మాట్లాడి ప్ర‌త్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు.  
 
ఇక ఇప్పుడు ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రంతిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను చంద్రబాబు నాయుడు అమరావతి లేదా హైద‌రాబాద్ లోని త‌న నివాసానికి త‌ర‌లించుకున్నారంటూ విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చంద్ర‌బాబు నివాసంలో త‌నిఖీలు చేయిస్తే క‌చ్చితంగా ఆభరణాలు బయట‌పడతాయని, బ‌య‌ట‌ప‌డ‌ని ప‌క్షంలో త‌న ప‌ద‌వికి వెంట‌నే రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
అయితే ఈ త‌నిఖీల విష‌యంలో చంద్ర‌బాబుకు 12 గంట‌ల స‌మ‌యం కంటే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తే  ఆ ఆభ‌ర‌ణాల‌న్నిఆయ‌న త‌న ప్ర‌త్యేక విమానంలో విదేశాల‌కు త‌ర‌లిస్తార‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విచ్చ‌లవిడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.  
 
అలాగే చంద్ర‌బాబు నాయుడు త‌న కుమారుడుపై వైసీపీ నాయ‌కులు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న‌ ఎందుకు సీబీఐ విచార‌ణ జ‌రిపించ‌లేద‌ని విజ‌య సాయి రెడ్డి ప్ర‌శ్నించారు. అయితే  సీబీఐ విచార‌ణ చేయిస్తే ఎక్క‌డ త‌న కొడుకు బండారం బ‌య‌టప‌డుతుందో అన్న భ‌యంతో చంద్ర‌బాబు విచార‌ణ వేయ‌ట్లేదని  ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.