విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mp vijaya sai reddy
Updated:  2018-04-30 07:20:24

విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై  వంచ‌న దీక్ష సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... ధ‌ర్మ పోరాట దీక్ష పేరుతో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని ధ‌ర్మానికి, న్యాయానికి మీనింగ్ తెలియ‌ని వ్య‌క్తి చంద్ర‌బాబు అని, ఈ రోజు తిరుప‌తిలో దీక్ష చేయ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంద‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు... ధ‌ర్మంగా మీరు పోరాటం చేస్తే గ‌తంలో మీ మామ‌గారు అయిన‌టువంటి ఎన్టీఆర్ ను ఎందుకు వెన్నునోటు పొడిచారో తెలుసుకోవాల‌ని గుర్తు చేశారు విజ‌య‌సాయి రెడ్డి.
 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారని, హోదా కోసం గుంటూరులో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష చేస్తే, ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారంటూ చంద్ర‌బాబు దీక్షను భగ్నం చేసిన చరిత్ర మీది కాదా అని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.... నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు ఏనాడు పోరాడిందిలేద‌ని అన్నారు... అధికారం అడ్డుపెట్టుకుని విచ్చ‌ల విడిగా అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, అయితే వీరి అవినీతికి చెక్ పెట్టే రోజులు ద‌గ్గ‌రలో ఉన్నాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.
 
దీంతో పాటు  2014 ఏప్రిల్‌ 30న తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభకు, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.... తిరుపతిలో నిర్వ‌హించేది ధర్మపోరాట దీక్ష కాదని అదొక అధర్మ సభ అని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు...
 
దీక్ష‌ల‌పేరుతో  చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌తీ అవినీతి అక్ర‌మాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస‌న్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీకి త‌గిన బుద్ది చెబుతార‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు... అలాగే చంద్ర‌బాబు అధికార బ‌లంతో విచ్చ‌ల‌విడిగా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ప్ర‌తీ దానిని సాక్షాల‌తో స‌హా ప్ర‌ధానమంత్రి ముందు హాజ‌రుప‌రుస్తాన‌ని అన్నారు... మ‌రి కొన్నిరోజుల్లో ముఖ్య‌మంత్రి చంద్రబాబు జైలుకు పంప‌డం త‌థ్యం అని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.