టీడీపీ ఎంపీకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదీ రాదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-07-17 04:17:02

టీడీపీ ఎంపీకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదీ రాదు

రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఈ రోజు జ‌రిగిన అఖిళ‌ల‌ప‌క్ష స‌మావేశంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి త‌న ఘళాన్ని విప్పారు. ఈ స‌మావేశం అయిపోయిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి డిఫెక్ట్ అయి ఇంకా పార్ల‌మెంట్ స‌భ్యులుగా  బుట్టారేణుక, ఎస్పీవై రెడ్డి, అలాగే అర‌కు పార్ట‌మెంట్ స‌భ్యులు కొత్త‌ప‌ల్లి గీతా కొన‌సాగుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. అయితే  అఖిల‌ప‌క్ష స‌మావేశంలో వైసీపీ ఎంపీగా ఎందుకు బుట్టారేణుక‌ను పిలిచారని ఈయ‌న విమ‌ర్శ‌లు చేశారు. 
 
అంతేకాదు ఒక లెట‌ర్ కూడా ఇష్యు చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే ఇదంతా అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పాత్ర త‌ప్పకుండా ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. రాజ్యంగానికి విరుద్దంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా పార్టీ మారిన స‌భ్యురాలిని ఎలా అఖిల‌ప‌క్షానికి పిలుస్తార‌ని అయ‌న మండిప‌డ్డారు. అందుకే తాను టీడీపీ నాయ‌కుల చర్య‌లు నీతి భాహ్య‌మైన చ‌ర్య‌ల‌ని చెప్పాన‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
అంతేకాదు టీడీపీ నాయ‌కులు త‌న వ‌ద్ద‌కు ఒక విష‌యాన్ని తీసుకువ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ పార్ల‌మెంట్ స‌భ్యుడు సీఎం ర‌మేష్ కు తెలుగు పూర్తిగా రాదని, ఇక ఇంగ్లీష్ అస‌లే రాద‌ని, హిందీ కూడా రాద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ర‌మేష్ త‌న జిల్లాలో నాటు సారాయి అమ్ముకునే వ్య‌క్తిని పార్ల‌మెంట్ స‌భ్యుడిగా టీడీపీ నాయ‌కులు ఎలా నియ‌మించారో త‌న‌కు ఇంతవ‌ర‌కు అంతుచిక్క‌కుంద‌ని ఆయ‌న ఆరోపించారు. తాను విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన అంశాల‌న్నింటిని కూడా తూచ త‌ప్ప‌కుండా ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర మ‌రోసారి వివ‌రించాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాదు విభ‌జ‌న చ‌ట్టంలో పొంద‌ప‌రిచిన‌ అంశాల‌ను కూడా తాను మోడీ ద‌గ్గ‌ర వివ‌రించాన‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.