విజ‌య‌సాయిరెడ్డి స‌ల‌హా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 04:12:43

విజ‌య‌సాయిరెడ్డి స‌ల‌హా

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... ప్ర‌వేశ‌పెట్టిన  చివ‌రి బ‌డ్జెట్ లో కూడా ఏపీకి ఎటువంటి న్యాయం చేయ‌లేద‌ని కేవ‌లం రాజ‌కీయంగా ఎన్నిక‌లు ఉన్న రాష్ట్రాల‌కు మాత్ర‌మే నిధులు కేటాయించింది అని, ఇటు ఏపీకి చెందిన ఆల్ పార్టీ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు.
 
ఇక లోక్ స‌భ‌లో రాజ్య‌స‌భ‌లో ఇరు పార్టీల నాయ‌కులు క‌లిసి నిర‌స‌న తెలిపారు.. ప్ల‌కార్డులు కూడా చూపారు.. ఇటు మోదీ ఎన్టీఆర్ హయాం రాజ‌కీయం చెప్పి తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం గురించి చెప్పి కాస్త సైకిల్ పార్టీ నాయ‌కుల‌ను చ‌ల్లార్చారు... అయితే మ‌ళ్లీ తెలుగుదేశం నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌ను కేంద్రం నెర‌వేర్చాలి అని కోరుతున్నారు.
 
ఇక వైసీపీ ఎంపీ రాజ్య‌స‌భ సభ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తాజాగా తెలుగుదేశం ఎంపీల‌కు ఓ స‌ల‌హా ఇచ్చారు... కేంద్రంలో భాగంగా ఉన్న టీడీపీ మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు రావాలి అని విజ‌య‌సాయి రెడ్డి డిమాండ్ చేశారు.. స‌ర్కారులో ఉండి స‌ర్కారుని విమ‌ర్శించ‌డం ఏమిట‌ని? అస‌లు నిర‌స‌న ఎలా వ్య‌క్తప‌రుస్తున్నారు అని మండిప‌డ్డారు... టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాన్ని వ్యతిరేకిస్తున్నామ‌న్నారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.
 
రాజ్యసభలో రూల్ 238-1, రూల్ 238-2, రూల్ 238-ఏ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తామని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75 ప్రకారం ఏ అంశమైనా, కేబినెట్‌లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం అంటే నమ్మకాన్ని పోగోట్టుకోవడం అని విజయసాయిరెడ్డి వివరించారు. 
 
ఇవాళ అదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన చెప్పారు. సుజనా చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ ప్రెసిడెన్సియల్ అడ్రస్‌ను అప్రూవ్ చేశారని, ఆ మంత్రికి మాట్లాడే అవకాశం ఛైర్మన్ వెంకయ్యనాయుడు కల్పించడాన్ని తప్పుపట్టామని విజయసాయి చెప్పారు.
 
మొత్తానికి మిత్ర‌ప‌క్షంగా ఉన్న తెలుగుదేశం నాయ‌కులు రాజీనామా చేయ‌కుండా, వైసీపీ ఎంపీల‌ను రాజీనామా చేయాలి అని అడ‌గ‌డం ఏమిటి అని ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నారు -ఆలోచిస్తున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.