వివాదం ముదిరిందా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 04:41:19

వివాదం ముదిరిందా....

ఏ రాష్ట్రంలోనైనా  రాజ‌కీయ పార్టీ నేత‌ల‌కు, ప్ర‌భుత్వ అధికారుల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే. ఉద్యోగంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం కార‌ణంగానో......వారికి అనుకూలంగా వ్య‌హరించ‌క‌పోవ‌డం చేత‌నో...ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. 
 
ఇటీవ‌ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ప‌లువురు టీడీపీ నేత‌ల‌తో పాటు ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద్ర‌పై కూడా తీవ్ర స్ధాయిలో విరుచుకుప‌డ్డారు. దీంతో విజ‌యసాయి రెడ్డిపై ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
 
ఇక్క‌డ ఇద్ద‌రి పరిస్థితులు ఒక్కటే అని చెప్పాలి. ఎందుకంటే ప్ర‌భుత్వ ఉద్యోగంలో ఉండి అధికార  పార్టీ నేత‌ల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం.....అదే విధంగా ఐఏఎస్ అధికారుల‌పై విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ‌టం కూడా త‌ప్ప‌నే అంటున్నారు.
 
అందులోనూ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామంటూ విజ‌య‌సాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.  ప్ర‌భుత్వ అధికారులు అధికార పార్టీ నేత‌ల ఒత్తిడి కార‌ణంగా ఇలా చేయాల్సి వ‌స్తుంద‌ని చెప్ప‌డంలో  ఏమాత్రం సందేహం లేదు. రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అప్పుడు కూడా ప్ర‌భుత్వ అధికారుల‌పై ఒత్తిడి తీసుకువ‌స్తారు. ఏది ఏమైనా...... అంతిమంగా ఎవ‌రైనా  ప్ర‌జాసేవ‌కులే క‌దా...స‌ర్ధుకుపోవాలి.....ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌గ‌ల‌గాలి. ముఖ్యంగా ప్ర‌భుత్వ అధికారులు అధికారంలో ఉన్న వారికి దాసోహం కాకుండా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.