విజ‌య‌సాయిరెడ్డి స్పీక‌ర్ కు లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-08 15:29:58

విజ‌య‌సాయిరెడ్డి స్పీక‌ర్ కు లేఖ‌

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ త‌ర్వాత అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి వైసీపీ నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న ఎంపీ కొత్తప‌ల్లి గీత పై వెంట‌నే అన‌ర్హ‌త వేట వెయ్యాల‌ని ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయి రెడ్డి మీడియా ద్వారా పేర్కొన్నారు. 
 
ఈ మేర‌కు ఆయ‌న లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హజ‌న్ కు ఒక లేఖ రాశారు. గ‌తంలోనే అమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం నుంచి త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తొల‌గించి గీతకు లేఖ కూడా పంపార‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
త‌మ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల‌పై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేట వెయ్యాల‌ని గ‌తంలో వైవీ సుబ్బ‌రెడ్డి కూడా డిమాండ్ చేశార‌ని ఆయ‌న గుర్తుచేశారు, అంతేకాదు ఈ నెల రెండ‌వ తేదిన తాను కూడా వైసీపీ త‌ర‌పున‌ కొత్త‌ప‌ల్లి గీత‌తో పాటు మిగిలిన వారిపై కూడా స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వెయ్యాల‌ని కోరాన‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగ విలువ‌లు, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు త‌క్ష‌ణ‌మే గీత‌పై అన‌ర్హ‌త వేటు వేయ్యాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.