బుట్టారేణుక‌కు షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 18:17:03

బుట్టారేణుక‌కు షాక్

వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామాలు స్పీక‌ర్ ఆమోదిస్తే ఈసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఎప్పుడు ఇస్తుందా అని ఆలోచ‌న‌లో ఉన్నారు... అయితే ఇటు వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామాలు ఆమోదింపచేసుకుని త‌మ‌కంటూ ప్ర‌జ‌ల్లో ఎంత ఆద‌రాభిమానం ఉందో, అలాగే కేంద్రానికి ప్ర‌త్యేకహూదా పై ప్ర‌జ‌లు ఏమి కోరుకుంటున్నారో తెలియ‌చేయాల‌ని చూస్తున్నారు...అయితే ఇటు లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్  విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత, రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వ‌స్తుంది.. అయితే ఇప్పుడు ఆ ఐదురుగు ఎంపీలు త‌మ‌తో పాటు మా పార్టీ గుర్తుతో గెలిచి, పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకురావాల‌ని  ఆలోచిస్తున్నారు..
 
అందులో భాగంగా వైసీపీ ఎంపీలు స్పీక‌ర్ కు ఆ ముగ్గురు ఫిరాయింపుల‌పై లేఖ‌లు ఇచ్చారు... అలాగే వారిపై లోక్‌స‌భ స్పీక‌ర్ చ‌ర్య‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ తీసుకోలేదు.. అయితే విప్ జారీచేసినా అవిశ్వాస తీర్మాణంలో ఎటువంటి ప‌రిస్దితి ఎదుర్కోవాలా అని కంగారు ప‌డ్డారు, చివ‌ర‌కు అవిశ్వాస తీర్మాణం పై చ‌ర్చ ఓటింగ్ రెండూ జ‌రుగ‌లేదు.
 
అయితే పార్టీ ఫిరాయించినా అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత తెలుగుదేశం కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు... ఇటు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాత్రం పార్టీ త‌ర‌పున యాక్టీవ్ గానే ఉంటున్నారు.. ఆయ‌న కుటుంబం కూడా ఇటు తెలుగుదేశంలో పోటీ కోసం సీట్ల కోసం ఎదురుచూస్తోంది... ఇటు క‌ర్నూలు ఎంపీ బుట్టారేణుక ఏకంగా తెలుగుదేశం మ‌హానాడుకు కూడా హాజ‌ర‌య్యారు.
 
ఇది వైసీపీ చేతికి చిక్కిన అస్త్రం... దీంతో వైసీపీ ఎంపీలు ఆమెపై ఫిర్యాదు చేశారు... వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన స‌మ‌యంలో ఆమె కండువా మార్చుకోక‌పోయినా, ఇప్పుడు వేరే పార్టీలో చేరి అక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం అనేది పార్ల‌మెంట్ డిసిప్లిమేట‌రీ క‌మిటీ త‌ప్పుబ‌ట్టింది... మొత్తం మ‌హానాడుకు సంబంధించిన ప్లెక్స్ లు, ఎంపీ బుట్టారేణుక అక్క‌డ పాల్గోన్న కార్య‌క్ర‌మాల వీడియోలు,  అన్నింటిపై స్పీక‌ర్ వ‌చ్చే లోపుల క‌మిటీకి స‌మ‌ర్పించి ఆమె పై చ‌ర్య‌లు తీసుకునేలా వైసీపీ రెడీ అవుతోంది... మ‌రి దీనిపై స్పీక‌ర్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.