టీడీపీ పై వైసీపీ ఎంపీలు ఘ‌టు వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 18:38:47

టీడీపీ పై వైసీపీ ఎంపీలు ఘ‌టు వ్యాఖ్య‌లు

ప్ర‌త్యేక‌హోదా సాధ‌న‌లో భాగంగా నేడు లోక్ స‌భ‌లో ప్ర‌తి ప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర స‌ర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు... ఈ అవిశ్వాస తీర్మానం నాలుగ‌వ రోజు చర్చ‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జ‌న్ ఏదో ఒక సాకుతో స‌భ‌ను ప్ర‌తీ రోజు వాయిదా వేసుకుంటూ పోతున్నార‌ని వైసీపీ ఎంపీలు మండిప‌డ్డారు... తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సుమారు వంద మందికి పైగా మ‌ద్ద‌తు ఉందని, లోక్ స‌భ ప్రారంభించిన ఐదు నిమిషాల‌కే వాటిని కౌంటింగ్ చేసి చ‌ర్చ ప్రారంభించ‌ వ‌చ్చని అన్నారు..  
 
కానీ ఇదంతా ఎన్డీఏ కావాల‌నే టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే ఎంపీల ఆందోళనలను స‌భను ఉల్లంగిస్తున్నార‌ని సాకు చెప్పి ప్ర‌తీ సారి స‌భ‌ను వాయిదా వేస్తున్నార‌ని వైసీపీ ఎంపీలు మండిప‌డుతున్నారు...కాగా వారు రెండో విడుత బ‌డ్జెట్ స‌మావేశం తొలి రోజు నుంచే రిజ‌ర్వేష‌న్ ల‌పై టీఆర్ఏస్ ఎంపీలు లోక్ స‌భ‌లో ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని అన్నారు...అయితే ఈ పార్టీకి తోడు అన్నాడీఎంకే తోడు అయింద‌ని తెలిపారు.
 
గ‌తంలో స‌భ ఆర్డ‌ర్ లో లేన‌ప్పుడు ఆర్థిక బిల్లును ఆమోదించుకుంద‌ని, కాని ఇప్పుడు స‌భ లో అవిశ్వాస తీర్మానం పెట్టే స‌రికి ద్వంద్వ విధానాన్ని పాటిస్తోంద‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు...  అందులో భాగంగానే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రానికి ఇంత‌గ‌తి ప‌ట్టేలా చేసింది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే అని... గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల పాటు కేంద్రంతో మిత్ర ప‌క్షంగా వ్య‌వ‌హరించి వారు తీసుకున్న నిర్ణ‌యాల‌కు టీడీపీ కూడా బాధ్య‌త వ‌హించింద‌ని తెలిపారు... 
 
ఈ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంవ‌ల్లే రాష్ట్రానికి ఈ గ‌తి ప‌ట్టింద‌ని అన్నారు... కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల్లో టీడీపీ మంత్రులు సంత‌కాలు చేశార‌ని, అందులో ప్ర‌త్యేక హోదాకు సంత‌కం చేయ‌లేద‌ని, ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీకి సంత‌కాలు చేశార‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు... అయితే ఇప్ప‌టికిప్పుడు కేంద్రంతో క‌టీఫ్ చెప్పి అదే ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతామంటే న‌మ్మేవాళ్లు ఇక్క‌డ ఎవ‌రూ లేర‌ని అన్నారు...  తమ అవిశ్వాస తీర్మానంపై లోక్ స‌భ‌లో చర్చ జరిగేవ‌ర‌కు వైఎస్సార్‌సీపీ నోటీసులు ఇస్తూనే ఉంటుంది అని తెలిపారు.

షేర్ :

Comments

1 Comment

  1. test aakruti

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.