వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం రాజీనామాలు..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 16:46:47

వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం రాజీనామాలు..?

ఏపీలో ప్ర‌త్యేక హూదా ఉద్య‌మం తారాస్ధాయికి చేరుకుంది... తెలుగుదేశం పార్టీ ఎటువంటి పోలిటిక‌ల్ స్టెప్ వేస్తున్నా అది వైసీపీని ఫాలో అయిన‌ట్లే ఉంటోంది అని ప్ర‌జ‌లు కూడా భావిస్తున్నారు.... ఇక వైసీపీ ముందు నుంచి తెలియ‌చేసిన‌ట్టు అవిశ్వాస తీర్మానానికి ముందుకు వెళ్లింది... అలాగే వైసీపీ తీర్మానం ఇవ్వ‌గానే ఆ గంట‌కు ముందు తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది.... అయితే ఈ అవిశ్వాస తీర్మానాల‌ను స‌భ‌లో స్పీక‌ర్ ప్ర‌స్తావించి మ‌ద్ద‌తు తెలిపే స‌భ్యుల‌ను కౌంట్ చేయాలి... కాని ఆ స‌మ‌యంలో మాత్రం  అన్నాడీఎం కే - టీఆర్ ఎస్ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో వెల్ లోకి రావ‌డం స‌భ్యుల‌ను లెక్కించ‌లేము అని స్పీకర్ చెప్ప‌డంతో స‌భ వాయిదా వేస్తున్నారు... గ‌త వారం రోజులుగా పార్ల‌మెంట్లో ఇదే పందా జ‌రుగుతోంది.
 
ఇక నిర‌వ‌ధిక వాయిదా వేయ‌డానికి కూడా బీజేపీ రెడీ అవుతున్న స‌మ‌యంలో ఏప్రిల్ 5 వ‌ర‌కూ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం లేదు అని తెలుస్తోంది... అయితే తెలుగుదేశం మాత్రం ఇటు బీజేపీ పై దాడి చేస్తోంది.. కాని వైసీపీ మాత్రం నేరుగా ప్ర‌త్యేక హూదా పోరాటంలో ముందుకు వెళుతోంది.... ఇటు వైసీపీ ఎంపీల‌తో జ‌గ‌న్ నేడు పాద‌యాత్ర చేస్తున్న ప్రాంతంలో స‌మావేశం నిర్వ‌హించారు.. ఎంపీల‌తో పార్ల‌మెంట్లో అనుసరించ‌వ‌ల‌సిన వ్యూహాల‌పై చ‌ర్చించారు.
 
ఈ స‌మ‌యంలో వైసీపీ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.. స్పీక‌ర్ ఫార్మెట్ లో ఎంపీలు రాజీనామాలు చేయాలి అని నిర్ణ‌యం తీసుకున్నారు..తాజాగా వైసీపీ ఎంపీలు ప్ర‌క‌ట‌న చేశారు స్పీక‌ర్ ఫార్మెట్ లో రాజీనామాలు చేస్తాం అని, మాతో పాటు తెలుగుదేశం ఎంపీలు క‌లిసి రావాలి అని కోరారు ... పార్ల‌మెంట్ నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన రోజునే రాజీనామాలు చేస్తాం అని అన్నారు.. 25 మంది ఎంపీలు రాజీనామా  చేస్తే కేంద్రంలో క‌ద‌లిక వ‌స్తుంది... నివ‌ర‌ధిక వాయిదా ప‌డిన రోజు రాజీనామాలు చేయాలి అని జ‌గ‌న్ ఎంపీల‌కు సూచించారు. మ‌రి తెలుగుదేశం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.