మూడు జిల్లాల‌ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైసీపీ స‌రికొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-17 11:09:39

మూడు జిల్లాల‌ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైసీపీ స‌రికొత్త ప్లాన్

అధికార తెలుగుదేశం పార్టీలో ఉత్త‌రాంధ్ర‌ ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గ్ర‌హించిన వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌లో బించేలా ఒక డ్యాక్యుమెంట‌రీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ల‌ను ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ప‌లుకుతుంది.
 
ఈ కాంటెస్టెంట్ ల‌కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి కోరిక మేర‌కు నిర్వ‌హించారు. అంతేకాదు విజేత‌ల‌కు విజ‌య‌సాయి రెడ్డి ద్వారా క్యాష్ ప్రైజ్ ను అంద‌జేయ‌డం జ‌రుతుంద‌ని పేర్కొన్నారు. విశాఖ విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టే విధంగా ల‌ఘు చిత్రాల‌ను చిత్రించాల‌ని కాంటెస్ట్ నిర్వాహ‌న బాధ్య‌త‌ల చేప‌ట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ సంస్థ పేర్కొంది.
jagan plan
 
అంతేకాదు డాక్యుమెంట‌రీ అండ్ షార్ట్ ఫిల్మ్ ను రెండు భాగాల్లో నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. షార్ట్ ఫిల్మ్ నిడివి 10 నిమిషాలు డాక్యుమెంట‌రీ నిడివి 15 నిమిషాలుగా నిర్ణ‌యించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్ర‌థ‌మ విజేత‌కు 5 ల‌క్ష‌లు ద్వితీయ విజేత‌కు 2 ల‌క్ష‌లు తౄతీయ విజేత‌కు 50 వేల రూపాయ‌ల‌ను విజ‌య‌సాయి రెడ్డి మీదుగా అంద‌జేయ‌నున్నారు.
 
అంతేకాదు రెండు విభాగాల్లో క‌లిపి మొత్తం 15 ల‌క్ష‌ల ప్రోత్సాకంగా అందించ‌బ‌డ‌తుంద‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల్సిన వారు ఈ నెల 30 తెదిలోపు చేసుకోవాల‌ని సూచించింది. అలాగే ఎంట్రీ ఫీజు ఉచితం. మ‌రిన్ని వివ‌రాల‌కు 7659864170 లేక ysrcp vizagitwing@gmail. com, www.ysrcpvizagitwing.com వైబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.