ఎమ్మిగనూరులో టీడీపీ ప్ర‌చారం వైసీపీ కొత్త వ్యూహం నిజ‌మేనా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:41:21

ఎమ్మిగనూరులో టీడీపీ ప్ర‌చారం వైసీపీ కొత్త వ్యూహం నిజ‌మేనా

క‌ర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో దివంగత బి.వి మోహన్ రెడ్డి కుమారుడు బి.వి జయ నాగేశ్వర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థి కేశ‌వ రెడ్డిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఎమ్మిగ‌నూరు సెగ్మెంట్ లో వైసీపీ జెండాను ఎగ‌ర‌వేయాల‌నే ఉద్దేశ్యంతో వైసీపీ నాయ‌కులు స‌రికొత్త వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.
 
ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఇంచార్జ్ కేశవ రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మిగ‌నూరులో పోటీ చేసి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు. మ‌రో వైపు ఎమ్మెల్యే బివి జ‌య‌నాగేశ్వ‌ర్ రెడ్డి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో నియోజ‌కవ‌ర్గం వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇక ఈ పోరులో గెలుపు ఓట‌మిని ప‌క్క‌న పెడితే ఇరు పార్టీ నాయ‌కులు సొంత వ్య‌యాన్ని వెచ్చించి ఎమ్మిగనూరును అభివృద్ది ప‌దంలో తీసుకువెళ్తున్నారు.
 
కర్నూల్ జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రభావం, టీడీపీ పైన ఉన్న వ్యతిరేకత, ప్రత్యక హోదాపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి, తప్పుడు హామీలతో ప్రజల్లో టీడీపీపైన తీవ్ర వ్యతిరేకత ఉంది...దానికి తోడు కేశవ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, తన పరిధిలో ఉన్న చోట సొంత వ్యాన్ని ఉపయోగించి పరిస్కార మార్గాన్ని చూపుతున్నారు...దింతో కేశవ రెడ్డికి గ్రాఫ్ బాగా పెరిగింది...
 
దీనిని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేశవ రెడ్డి పోటీ చేస్తే టీడీపీ ఖ‌చ్చితంగా ఓడిపోతుంద‌ని భావించి ఆయన పోటీచేయడం లేదని, వైసీపీ నుండి కొత్త వ్యక్తిని పోటీ చేయిస్తున్నారని సోష‌ల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు...ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో వైసీపీ నాయ‌కుల‌ను ఎదుర్కోలేక ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి ఫేక్ వార్త‌లను ప్ర‌చారం చేయడం మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.