టార్గెట్ చింత‌మ‌నేని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijayasai reddy
Updated:  2018-03-04 02:45:12

టార్గెట్ చింత‌మ‌నేని

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కేసుల వ్య‌వ‌హారంపై మ‌రోసారి త‌న‌దైన శైలిలో స్పందించారు.  ఎమ్మెల్యేగా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని సాయి రెడ్డి  డిమాండ్ చేశారు. దీంతో పాటు చింత‌మ‌నేనికి   కోర్టు రెండేళ్లకుపైగా జైలు శిక్ష విధించినందున  దెందులూరు అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా పేర్కొంటూ స్పీకర్ నోటిఫై చేయాల్సివుంద‌ని సాయి రెడ్డి గుర్తు చేశారు.
 
మ‌రోవైపు పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ మ‌రోసారి స్పీక‌ర్ కోడెల‌కు విజ్ఝ‌ప్తి ప‌త్రం ఇచ్చిన‌ట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ వ్యవహరించాలని కోరామన్నారు విజ‌య‌సాయి రెడ్డి. అంతేకాకుండా  ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని,  ముందుగా చెప్పిన‌ట్లుగానే ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని మ‌రోసారి గుర్తు చేశారు విజ‌య‌సాయి రెడ్డి.
 
హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించింద‌ని, అన్ని ఆలోచించే అవిశ్వాసం, రాజీనామాల వంటి క‌ఠిన నిర్ణయాలు తీసుకున్నామ‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా ఈ సారి అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా వెళ్ల‌బోమ‌ని వైసీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది.
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.