పాద‌యాత్ర త‌ర్వాత నెక్ట్స్ ప్లాన్ ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 16:27:26

పాద‌యాత్ర త‌ర్వాత నెక్ట్స్ ప్లాన్ ఇదే

బీసీలకు సముచిత స్థానం కల్పించిన నేత మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని బీసీలకు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన ఘనత ఆయ‌న‌కే  దక్కుతుందని రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, బీసీ వర్గాలు ఈరోజు ఉన్నత చదువులు చదువుతున్నారు అంటే దానికి కారణం మహానేత రాజశేఖర్ రెడ్డి చల‌వ‌ వల్లే అని ఆయ‌న‌ పేర్కొన్నారు.
 
ఈ రోజు నిర్వ‌హించిన  అధ్యయన కమిటీలో సూచనలు, సలహాలు ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకొని పాదయాత్ర ముగింపు తర్వాత వైసీపీ అధ్య‌క్షుడు జగన్ మోహన్ రెడ్డికి వివ‌రిస్తాన‌ని తెలిపారు. అంతేకాదు బీసీల గర్జన పేరుతో సభ ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బీసీ కుల‌స్తుల‌కే కాకుండా అన్ని రకాల వర్గాల వారికి మేలు జరుగుతుంద‌ని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో పుంగనూరు శాసన సభ్యులు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, మదనపల్లి శాసన సభ్యులు తిప్పారెడ్డి , పీలేరు శాసన సభ్యులు చింత‌ల‌ రామచంద్ర రెడ్డి, తంబళ్ళపల్లి ఇంచార్జి ద్వారకా నాథ్ రెడ్డి , ఈశ్వరయ్య, పసుపులేటి సుధాకర్, రాయచోటి విజయ భాస్కర్, గోవింద్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.