నెల్లూరులో న‌యా ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-07 11:01:46

నెల్లూరులో న‌యా ప్లాన్

నెల్లూరు జిల్లాలో వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన సీట్ల‌తో, తెలుగుదేశం షాక్ కు గురి అయింది, రాష్ట్రంలో అధికారం వ‌చ్చినా నెల్లూరు క‌ర్నూలు క‌డ‌ప‌లో దారుణ‌మైన ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్నాము అని మ‌ద‌న‌ప‌డింది తెలుగుదేశం పార్టీ.. దీంతో ఫిరాయింపుల తివాచి ప‌రిచింది.. అందులో భాగంగా పార్టీ నుంచి గూడురు ఎమ్మెల్యే ని వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వ‌చ్చేలా చేశారు పార్టీ నాయ‌కులు.
 
మిగిలిన నాయ‌కుల‌కు వ‌ల విసిరినా వారు తెలుగుదేశం పార్టీలో  చేర‌లేదు.. దీంతో తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ విజ‌యం సాధించాలి అనే ఉత్సుక‌త‌తో ఉంది.. అయితే తెలుగుదేశం ఫిరాయిపుల‌ను చేయ‌డంతోఇక్క‌డ కేడ‌ర్ నుంచి ప్ర‌జ‌ల వ‌రకూ పార్టీలో వ‌ర్గ‌పోరు  పెరిగింది. ఇక పార్టీలో ద్వితీయ కేడ‌ర్ కూడా పార్టీ మారాలి అని నిర్ణ‌యాలు తీసుకుని కొంద‌రు తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి వ‌చ్చారు.
 
జిల్లాలో ద్వితీయ కేడ‌ర్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా నిరోధించాలి అని ప్ర‌ణాళికా వేసినా, చాలా వ‌ర‌కూ ద్వితీయ‌స్ధాయి కేడ‌ర్ బ‌య‌ట‌కు వెళ్లింది.. ఇక  తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఫిరాయింపుల వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక్ల‌లో గూడురు సీటు ఎవ‌రికా అనేది ఇంకా ఆలోచ‌న‌గానే ఉంది.
 
ఇక ప్ర‌స్తుతం జిల్లాలో ఆరుగురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు... గూడురు ఫిరాయింపుతో ఓ సీటు త‌గ్గింది.. అయితే ఇప్పుడు ఉన్నా ఆరుగురితో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయింపు సీటు కూడా భారీ మెజార్టీతో గెలుచుకునే అవ‌కాశాలు మెండుగానే ఉన్నాయి..కొవూరు, వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి సెగ్మెంట్ల‌లో విజ‌యానికి వైసీపీ గ‌త నాలుగేళ్ల క్రిత‌మే ప్ర‌ణాళిక ర‌చించింది..ఇక్క‌డ సెగ్మెంట్ల‌లో తెలుగుదేశం చేస్తున్న ప‌రిపాల‌న‌పై వైసీపీ నిల‌దీస్తోనే ఉంది.
 
నెల్లూరులో జ‌గ‌న్ కు ప‌ది సీట్లు క‌చ్చితంగా వ‌స్తాయి అని క్లీన్ స్వీప్ చేయ‌డం ప‌క్కా అంటున్నారు వైసీపీ శ్రేణులు ఇటు విజ‌య‌సాయిరెడ్డి, మేక‌పాటి, ఎంపీలుగా జిల్లా రాజ‌కీయాల‌ను ముందుకు న‌డిపిస్తున్నారు. ఇప్ప‌టికే టికెట్లు ఎవ‌రికి అనేది ఫిక్స్ చేయ‌డం పాద‌యాత్ర‌లో చాలా వ‌ర‌కూ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు పెర‌గ‌డం వైసీపీకి ప్ల‌స్ అయింది.. ఇక వైసీపీ న‌యాప్లాన్ తెలుగుదేశం పై ఎటువంటి ప్ర‌భావం చూపుతుందో చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.