ఆ సెగ్మెంట్ లో ఫ్యాన్ గాలికి సైకిల్ పంక్చ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp flags
Updated:  2018-09-28 03:02:03

ఆ సెగ్మెంట్ లో ఫ్యాన్ గాలికి సైకిల్ పంక్చ‌ర్

మ‌ణ్యం వీరుడు అల్లూరీ సీతారామ‌రాజు గ‌డ్డ‌గా పేరున్న న‌ర్సీపట్న నియోజ‌క‌వ‌ర్గం విశాఖ జిల్లా రాజ‌కీయాల్లోనే ప్ర‌త్యేక‌మైన‌ది. ఏజెన్సీ ముఖ ద్వారం అని చెప్పుకునే న‌ర్సీప‌ట్నంలో వెల‌మ, కాపు సామాజిక‌వ‌ర్గాలు ప్ర‌ధాన‌మైన‌వి. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగు సార్లు మంత్రిగా, ఎంపీగా సుమారు  35 ఏళ్ల రాజ‌కీయ అనుభవం ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు చాలాకాలంగా న‌ర్సీప‌ట్నం నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తూ వ‌స్తున్నారు. 
 
టీడీపీ ఆవిర్భావం నుంచి 1989, 2009 మిన‌హా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు అయ్య‌న్న‌. ఇక 2014 ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో అయ్య‌న్న కేవ‌లం రెండు వేల ఓట్ల పైచిలికి ఓట్ల‌తో గ‌ట్టెక్కారు.  ప్ర‌స్తుతంఆయ‌న టీడీపీ హయాంలో మంత్రి హోదాలో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టున్న అయ్య‌న్న పాత్రుడు గ‌డిచిన ఎన్నిక‌ల్లో అమ‌లు చేయ‌లేని హామీల‌ను ప్ర‌క‌టించి ఎమ్మెల్యే అయ్యారు. 
 
అయితే ఆయ‌న ఎమ్మెల్యే అయి నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు అయినా కూడా ఒక్క హామీను కూడా నెర‌వెర్చ‌లేద‌ని న‌ర్సీ ప‌ట్నం ప్ర‌జ‌లు వాపోతున్నారు. మేజ‌ర్ ప‌ట్నంగా ఉన్న న‌ర్సీప‌ట్నం మున్సిపాలిటిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత నుంచి టీడీపీ స‌ర్కార్ ఆస్తి ప‌న్నును భారీగా పెంచ‌డంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌స్థాయిలో ఉంది. ఇక ఈ స‌య‌స్య‌ను మంత్రి అయ్య‌న్న ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌న్న అసంతృప్తి ఉంది. విష‌యం ఏదైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టే మ‌న‌స్థ‌త్వం అయ్య‌న్ను అభిమానించే వాళ్ల‌కు న‌చ్చినా ఆయ‌న వ్య‌వ‌హార శైలితో అధిష్టానం అనేక సార్లు ఇరుకున ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. 
 
అంతేకాదు ఇదే పార్టీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసు రావుతో విభేదాలు పార్టీని బంగాళాకాతంలోక తోసేశాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న వార‌సుడిగా ఆయ‌న కుమారుడు విజ‌య్ తెర‌పైకి వ‌స్తార‌నే ప్ర‌చారం చాలా కాలంగా సాగుతోంది. న‌ర్సీప‌ట్నం లేదా అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ స్థానం నుంచి విజ‌య్ పోటీ చెయ్య‌వ‌చ్చ‌నే ఊహాగాపాలు వ్య‌క్తం అవుతున్నాయి. అలాగే నర్సీప‌ట్నం నుంచి వ‌చ్చేఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని అంటున్నారు అయ్య‌న్న‌.
 
 ఇక మ‌రోవైపు గ‌డిచిన ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో ఓడిపోయిన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చేఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగ‌ర‌వెయ్య‌ల‌ని చూస్తుంది. గ‌తంలో కంటే ఇప్పుడు న‌ర్సీప‌ట్నంలో వైసీపీ జోరు పుంజుకుద‌నే చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.