వైసీపీ ప్లాన్ స‌క్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp leaders image
Updated:  2018-03-01 06:37:33

వైసీపీ ప్లాన్ స‌క్సెస్

ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌న ల‌క్ష్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేర‌కు  రాష్ట్రంలో 13  జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌లో వైసీపీ ధ‌ర్నా నిర్వ‌హించింది....ఈ కార్య‌క్ర‌మానికి హ‌జ‌ర‌వుతున్న వైసీపీ శ్రేణుల‌ను పోలీసులు ఎక్క‌డిక్క‌డే అడ్డుకున్నారు. క‌లెక్ట‌రేట్‌ల ముందు ధ‌ర్నా  నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి లేదంటూ వైసీపీ  నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. అయిన‌ప్ప‌టికీ  మొండి ధైర్యంతో వైసీపీ నాయ‌కులు ధ‌ర్నా నిర్వ‌హించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ది చెంద‌డానికి ప్ర‌త్యేక హూదా  చాలా అవ‌స‌రం. హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా నిర్విరామంగా పోరాటం చేస్తోంది. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జ‌ర‌గ‌డం వ‌ల్ల వైసీపీ త‌న పోరాటాల‌ను మ‌రింత ఉధృతం చేస్తోంది. అందులో భాగంగానే క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డి, మార్చి 6న ఎంపీల రాజీనామా లాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది వైసీపీ.
 
గుంటూరు క‌లెక్ట‌రేట్ ముట్ట‌డిలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని, రోజుకో రకంగా మాట్లాడుతూ ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు తీరును విమర్శించారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ ప్ర‌త్యేకహోదా ఆంధ్ర ప్ర‌జ‌ల హ‌క్కు అని అన్నారు. చంద్ర‌బాబు కేసుల కోసం హోదాను తాక‌ట్టు పెట్టారంటూ విమ‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోన్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు పార్టీ త‌రుపున‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు విజ‌య‌సాయి రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.