ఆయ‌న కోసం వైకాపా ఎదురుచూపులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 11:48:50

ఆయ‌న కోసం వైకాపా ఎదురుచూపులు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌లు ఎంతో కీల‌కంగా మారనున్నాయి. పార్టీ స్ధాపించిన నాటి నుండి  అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కంతో ముందుకు సాగుతున్న.... వైకాపా వ‌చ్చే ఎన్నిక‌లకు మాత్రం త‌గిన జాగ్రత్త‌లు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.
 
ఇందులో భాగంగానే ప్ర‌జల ఆద‌ర‌ణ పొందేందుకు, ప్రజాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్. దీంతో పాటు  అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా కూడా వ్యూహాలు ర‌చిస్తూ  ముందుకు సాగుతున్నారు.
 
ఈ క్ర‌మంలో ఇప్పుడు  ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలోని .  కీలకనేతను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర ఇదే జిల్లాలో కొన‌సాగుతోంది. దీంతో  ఈ జిల్లాలో  పార్టీని మ‌రింత ప‌టిష్టం చేసే దిశ‌గా క‌స‌ర‌త్తులు సాగుతున్నాయి. 
 
ఇందులో భాగంగా  ప్ర‌కాశం జిల్లాలో కీల‌క నేత‌,  మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని  పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మానుగుంట ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌ట్లేదు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.