చంద్ర‌బాబుకు వైసీపీ సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 05:18:41

చంద్ర‌బాబుకు వైసీపీ సూటి ప్ర‌శ్న‌

అధికార బ‌లంతో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చిర స్థాయిగా త‌మ‌ నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌నే ఉద్దేశంతో రాజ్యంగానికి విరుద్దంగా ప్ర‌జ‌లకు క‌ల్పించిన ఓటును తొల‌గిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. ఈ రోజు విశాఖప‌ట్నంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉన్న క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష ఓట్ల‌ను టార్గెట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న 16 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించార‌ని బొత్స మండిపడ్డారు. అయితే ఈ విష‌యంపై ఎన్నిక‌ల క‌మీష‌న్ కు కూడా ఫిర్యాదు చేశామని, అధికారులు త‌మ ఫిర్యాదును ప‌రిగ‌న‌లోకి తీసుకోవాల‌ని లేకపోతే తాము వైసీపీ త‌ర‌పున తిరుగాబాటు చేస్తామ‌ని, అందుకు ప్ర‌జ‌లు కూడా స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.
 
అలాగే ఈ రోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క్యాబినెట్ లో నిరుద్యోగ భృతి ఇస్తాన‌డం హాస్యస్ప‌దంగా ఉంద‌ని బొత్స అన్నారు. గతంలో కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు సార్లు  క్యాబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేద‌ని బొత్స గుర్తు చేశారు.
 
గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ నాయ‌కులు జ‌న‌సేన, బీజేపీల‌తో పొత్తుపెట్టుకొని తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క నిరుద్యోగికి జాజ్ ఇస్తామ‌ని జాబ్ ఇవ్వ‌ని ప‌క్షంలో ప్ర‌తీ ఒక్క‌రికి నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయ‌ల‌ను ఇస్తామ‌ని చెప్పార‌ని బొత్స అన్నారు. అయితే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాల 5 నెలలు పూర్తి అయిన‌ త‌ర్వాత ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో నిరుద్యోగులు ముఖ్య‌మంత్రికి గుర్తుకువ‌చ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అందుకోస‌మే ఇప్పుడు హాడావుడిగా క్యాబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసి 1000 రూపాలలు ఇస్తామ‌ని చెబుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
అయితే క‌నీసం ఈ 1000 రూపాయాలు అయిన ఎప్పుడు ఇస్తారో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న చెయ్యాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. మ‌ళ్లీ గ‌తంలో లాగా క్యాబినెట్ స‌మావేశంలో నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పి మొసం చెయ్య‌వ‌ద్ద‌ని ఆయ‌న చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.