టీడీపీకి వైసీపీ 10 ప్ర‌శ్న‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 18:00:44

టీడీపీకి వైసీపీ 10 ప్ర‌శ్న‌లు

తెలుగుదేశం నాలుగేళ్లు బీజేపీలతో క‌లిసి ప‌నిచేసింద‌నేది తెలిసిందే... బీజేపీతో విభేదాలు రావ‌డం, ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది అని, తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేసి ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది....ముఖ్యంగా ఎన్డీయే నుంచి టీడీపీ ఇదే విష‌యంపై విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చింది.. అయితే ఇక్క‌డ వైసీపీ నాయ‌కులు  నాయ‌కులు టీడీపీని అడిగేవి కొన్ని ప్ర‌శ్న‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి..
 
1. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని అమ‌రావ‌తికి శంకుస్తాప‌న‌కు ఆహ్వానించింది ఎవ‌రు?
2. .400 కోట్ల రూపాయల‌తో ఆర్బాటంగా కార్య‌క్ర‌మం చేయించింది ఎవ‌రు?
3.. నీరు మ‌ట్టి తీసుకుర‌మ్మ‌ని మోదికి చెప్పింది ఎవ‌రు?
4.. బీజేపీ నాయ‌కుల‌తో నాలుగేళ్లు క‌లిసింది ఎవ‌రు?
5.. ప్ర‌త్యేక హూదా సంజీవ‌నా అని ప్ర‌శ్నించింది ఎవ‌రు?
6.. ప్ర‌త్యేక‌హోదా వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయా అని క్వ‌శ్చ‌న్ వేసింది ఎవ‌రు?
7.. మ‌న రాష్ట్రానికి కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చింది అని చెప్పంది మీరు కాదా?
 అది ప‌చ్చ ప‌త్రిక‌ల్లో రాలేదా?
 8.. బీజేపీని పొగిడింది మీరు కాదా?  దేశంలో నోట్ల ర‌ద్దును ఆహ్వానించింది మీరు కాదా?
 9...29 సార్లు దిల్లీలో ప్ర‌ధానిని క‌లిశాను అంటున్నారు ఎందుకు క‌లిశారు అనేది చెప్పారా?
10..ఓటుకు నోటు కోసం బ‌య‌ప‌డి హైద‌రాబాద్ నుంచి క‌ర‌క‌ట్ట‌కు జ‌గ‌న్ పారిపోయాడా లేదా ఎవ‌రు పారిపోయారు.?
 
జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలుగుదేశానికి అల‌వాటుగా అదో టీడీపీ ఆన‌వాయితీగా మారిపొయింది అని వైసీపీ విమ‌ర్శిస్తోంది... రాష్ట్రంలో చిన్న పిల్ల‌వాడు చీమ కుట్టి ఏడ్చినా దానికి జ‌గ‌న్ కార‌ణం అనేలా ఉన్నారు అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. తెలుగుదేశం నాయ‌కులు బీజేపీతో జ‌గ‌న్ క‌లిశాడు అని అంటున్నారు.. మ‌రీ మీరు నాలుగేళ్లు క‌లిసి సాధించింది ఏమిటో ఓ సారి చెప్పండి ప్ర‌జ‌లకు
 
!!సామాన్యుడి ఆవేద‌న!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.