వైసీపీ బ‌స్సు యాత్ర‌కు రెడీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 01:46:24

వైసీపీ బ‌స్సు యాత్ర‌కు రెడీ

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న టీఆర్‌య‌స్ పార్టీ మ‌రోసారి విజ‌యం సాధించ‌డానికి వ్యూహాలు ర‌చించుకుంటోంది.  ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపోంది అధికారం చేప‌ట్టాల‌న్న‌ ప‌ట్టుద‌ల‌తో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. మ‌రోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాలో కూడా త‌మ జెండా ఎగ‌ర‌వేయాల‌ని భావిస్తోంది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన ప్రోఫెస‌ర్ కోందండ‌రామ్ కూడా పార్టీ స్థాపించ‌డానికి సిద్దం అవుతున్నారు.. ఇన్ని పార్టీల న‌డుమ తెలంగాణాలో రాజ‌కీయాలు చేయ‌డానికి సిద్దం అవుతోంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణాలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. లోటస్‌పాండ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో గట్టు  మాట్లాడుతూ తెలంగాణలో అన్ని జిల్లాలో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ, ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో జ‌రిగిన భారీ  అవినీతిని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామ‌ని తెలిపారు.
 
రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం పై ఒత్తిడి తెచ్చేలా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేరోజు పాదయాత్రలను నిర్వహిస్తామన్నారు... గ‌తంలో దివంగత నేత సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  తెలంగాణను ఎలా అభివృద్ది  చేశారో ప్ర‌జ‌ల‌కు యాత్ర‌లో వివ‌రిస్తామ‌ని అన్నారు. మార్చి 13న పార్టీ ముఖ్య‌నాయ‌కుల‌తో స‌మావేశమై ప‌ర్య‌ట‌న రూట్‌ మ్యాప్  ఖరారుతో పాటు, బస్సు యాత్ర కమిటీలను సైతం ప్రకటిస్తామని ఆయ‌న‌ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.