చంద్ర‌బాబుపై వైసీపీ సీనియ‌ర్ నేత ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 16:08:15

చంద్ర‌బాబుపై వైసీపీ సీనియ‌ర్ నేత ఫైర్

క‌డప జిల్లాలో సుర‌భి నాట‌క సంస్థ చేయ‌నంతన‌ట‌న‌ సామ‌ర్థ్యాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దీక్ష‌ల పేరుతో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత భూమ‌న‌ క‌రుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు వైసీపీ కేంద్ర‌కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
నాలుగు సంవ‌త్స‌రాల పాటు కేంద్ర ప్ర‌భుత్వంతో భాగ‌స్వామిగా ఉంటూ గతంలో తాము విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన అంశాల‌ను వివ‌రిస్తుంటే అవి కేంద్రానికి తెలియనివ్వ‌కుండా భుజాన వేసుకున్న‌టువంటి చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో దొంగ దీక్ష‌లు చేయిస్తున్నార‌ని భూమ‌న‌ క‌రుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు దీక్ష‌లు చేస్తుంటే హ‌త్య‌చేసిన వ్యక్తి హ్య‌త‌కు గురిఅయిన కుటుంబానికి న్యాయం చేయాల‌న్న‌ట్లు వారు దీక్ష‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు
 
ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ కోసం ఈ రోజు మ‌రో సుర‌భీ నాట‌క సంస్థ లాగా విశాఖ ప‌ట్నంలో దీక్ష చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల అవ‌సరాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే టీడీపీ నాయ‌కులు దీక్ష‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. 
 
విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను నెర‌వేర్చ‌కుండా మోసం చేసినందుకు, ఆ విష‌యాల‌ను దారి మ‌ళ్లించే దిశ‌గా టీడీపీ నాయ‌కులు డ్రామాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌లకు జ్ఞాప‌కశ‌క్తి త‌క్కువ‌ని ఆయ‌న ప్ర‌సారం చేసే మాట‌ల ద్వారా ఆయ‌న ఏం చెప్పినా కూడా చెల్లు బాటు అవుతుంద‌నే ఉద్దేశంతో చంద్రబుబు ధ‌ర్మ‌పోరాటాల పేరుతో అధ‌ర్మాల‌ను తెర‌పైకి తీసుకువ‌స్తున్నార‌ని క‌రుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల‌మీద కొంచెం కూడా చిత్త‌శుద్ది లేద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.