బాబు దానికి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇచ్చారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 17:37:21

బాబు దానికి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇచ్చారు

పోల‌వ‌రం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి గుండెలాంటిద‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం ప‌నుల‌ను పూర్తి చేస్తే వ్య‌వ‌సాయానికి, తాగు నీరుకి ఎంతో ఉప‌యోగ ప‌డుతుందని బొత్స స్ప‌ష్టం చేశారు.
 
అయితే తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించార‌ని అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ ప్రాజెక్ట్  అంశాన్ని తెర‌మీద‌కు తీసుకురాకుండా త‌న స్వార్ధంతో ఈ ప్రాజెక్ట్ విష‌యంలో అవినీతికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని బొత్స మండిప‌డ్డారు. అంతేకాదు పోల‌వ‌రాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌క్కన పెట్టి ప‌ట్టిసీమ‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చార‌ని మండిప‌డ్డారు.
 
ఈ ప‌ట్టిసీమ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి టీడీపీ నాయ‌కులు విచ్చ‌ల‌విడిగా అవినీతి అక్ర‌మాలు చేశార‌ని ఆయ‌న విమ‌ర్శలు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుకు ఎవ‌రు అయితే సంచులు సంచులు ముడుపులు అందించారో వారంద‌రికి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టులు ఇచ్చార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. అంతేకాదు పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంపై కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను బొత్స సూటిగా ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా మీ విమ‌ర్శ‌ల డ్రామాల‌ను ఆపి  ప్రాజెక్ట్ పై నిజాలు మాట్లాడాలని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.