టీటీడీ న‌గ‌ల‌కు స‌మానంగా స‌ర్కార్ మ‌రో అవినీతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-03 06:13:11

టీటీడీ న‌గ‌ల‌కు స‌మానంగా స‌ర్కార్ మ‌రో అవినీతి

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. సామాన్యుల భూముల నుంచి చివ‌ర‌కు దేవాల‌య న‌గలు, భుములు అక్ర‌మంగా ఆక్ర‌మించుకుంటున్నారు. ఇప్ప‌టికే టీడీపీ నాయ‌కులు టీటీడీలో ఉన్న శ్రీవారి న‌గ‌లు, దుర్గ‌గుడిలోని చీరా, మ‌ల్ల‌న్న ఆభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నారని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వ్య‌వ‌హ‌రాల‌న్నింటిపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాల‌ని నాటి నుంచి నేటివ‌ర‌కు స‌వాల్ విసురుతూనే ఉన్నారు.
 
ఇక ఈ వ్య‌వ‌హారం మ‌రువ‌క ముందే టీడీపీ నాయ‌కులు మ‌రో అవినీతికి పాల్ప‌డ్డారు. దీంతో వ‌ర్గ విభేదాలు మ‌రోసారి టీడీపీలో భ‌గ్గుమ‌న్నాయి. తాజాగా వ‌క్ఫ్ బోర్డు భూములను టీడీపీ నాయ‌కులు క‌బ్జా చేస్తున్నార‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఫ‌రుక్ మండిప‌డ్డారు.
 
నంద్యాలలో ఉన్న వ‌క్ఫ్ బోర్డ్ కు చెందిన 22.85 ఎక‌రాల స్థాలాన్ని టీడీపీకి చెందిన ఒక కీల‌క నాయ‌కుడు స్వాదినం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో పాటు ఇదే ప్రాంతానికి చెందిన 236 స‌ర్వే నెంబ‌ర్ లోని 16 ఎక‌రాల స్థాల‌నికి మ‌రో టీడీపీ నాయ‌కులు క‌న్నేశార‌ని వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ కు ఫిర్యాదు చేశారు.
 
ఇక ఈ ఆక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ టీడీపీ నాయ‌కుల‌ను వ్య‌తిరేకిస్తూ ఓ వ‌ర్గం వారిపై తిర‌గ‌బ‌డాల‌ని ధ‌ర్నాలు, రాస్తారోకోలు  చెయ్యాల‌ని ఫ‌రుక్ పిలుపునిచ్చారు. ఇక చైర్మ‌న్ కోరిక మేర‌కు ముస్లిం సోద‌రులు ద‌ర్నాలు చేయ‌బోతే వారిపై టీడీపీ నాయ‌కులు అధికార బ‌లంతో త‌న వ‌ర్గీయుల‌తో దాడులు చేయిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.