స‌రైన‌దేనా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 11:31:42

స‌రైన‌దేనా....

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా...అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మ‌రి వైసీపీ తీసుకోనున్న నిర్ణ‌యం స‌రైన‌దేనా.....? కాదా.....? అనే దానిపై కూడా తీవ్రమైన చ‌ర్చ కొన‌సాగుతోంది. ఇంత‌కీ వైసీపీ తీసుకోనున్న ఆ నిర్ణ‌యం ఏంటి.....?
 
2014 ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నుండి అధికార పార్టీలోకి జంప్ అయిన శాస‌న‌స‌భ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ తో గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు వైకాపా ఎమ్మెల్యేలు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే మార్చి 5 నుండి  ఏప్రిల్  6 వ‌ర‌కు జ‌రగనున్న బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కావాలా....? వ‌ద్దా......? అనే దానిపై కూడా పార్టీ అధిష్టానంతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని ఒంగోలు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి పేర్కొన్నారు.
 
ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై  చ‌ర్య‌లు తీసుకునేంత వ‌ర‌కు అసెంబ్లీకి రాబోమ‌ని తేల్చి చెప్పిన వైకాపా.... బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌నే దానిపై ఇప్పుడు ఆస‌క్తి నెల‌కొంది. నిజంగా స‌మావేశాల‌కు వైకాపా ఎమ్మెల్యేలు హాజ‌రుకాక‌పోతే త‌ప్పిదం చేసిన‌ట్ల‌వుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 
 
ప్ర‌జా స‌మస్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు వేదిక మాత్ర‌మే కాకుండా ఎంతో కీల‌క‌మైన బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రుకాకూడ‌ద‌ని అనుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న వైకాపా  బ‌డ్జెట్ స‌మావేశాల‌పై స‌రైన నిర్ణ‌య‌మే తీసుకుంటుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.