రాష్ట్ర‌ బంద్ సాక్షిగా వైసీపీ సంచ‌ల‌న హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-24 17:51:46

రాష్ట్ర‌ బంద్ సాక్షిగా వైసీపీ సంచ‌ల‌న హామీ

ఏపీ ప్రతిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. అధినేత‌ పిలుపు మేర‌కు వైసీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తీ చోట బంద్ ను నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ బంద్ కు రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం స్ప‌చ్చందంగా మ‌ద్ద‌తు తెలుప‌కుండా ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులను అక్ర‌మంగా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పోలీస్ అధికారుల‌తో అరెస్ట్ చేయించి వారిని స్టేష‌ష‌న్ కు త‌ర‌లిస్తున్నారు. 
 
అయితే ఇదే క్ర‌మంలో ఏలూరులో వైసీపీ నాయ‌కులు స్వ‌చ్చందంగా చేస్తున్న బంద్ లో వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న బంద్ లో పాల్గొన్న కొన్ని నిమిషాల‌కే పోలీస్ అధికారులు వైవీ సుబ్బారెడ్డిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన‌ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీకి ఏ పార్టీ అయితే ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పి సంత‌కం చేస్తుందో తాము ఆ పార్టీకే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని మ‌రోసారి గుర్తు చేశారు ఆయ‌న‌. 
 
చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల ఎన్న‌డు రోడ్డున ఎక్కని ప్రజ‌లు కూడా రోడ్డు ఎక్కి ప్ర‌త్యేక హోదా కోసం ధ‌ర్నాలు బంద్ లు చేస్తున్నార‌ని వైవీ మండిప‌డ్డారు. బ్రిటీష్ వారు దేశ ప్ర‌జ‌లు ఏ విధంగా అణ‌చి వేశారో అంత‌కంటే ఎక్కువ టీడీపీ పరిపాల‌న‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అణ‌చివేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబుకు చిత్తశుద్ది లేదని, ఒకవేళ ఆయ‌నకు చిత్త‌శుద్ది ఉంటే హోదా కోసం బంద్‌ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే కేవ‌లం వంద‌రోజుల్లో ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.