జేసీ ఫ్యామిలీకి ఇక చుక్క‌లే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 12:18:26

జేసీ ఫ్యామిలీకి ఇక చుక్క‌లే

రాష్ట్రంలో జేసీ ఫ్యామిలీ రాజకీయాలే వేరు, పార్టీలో కొనసాగుతూనే ఆ పార్టీ నేతలను, ఆ పార్టీ అధ్య‌క్షులును విమర్శించడం ఒక్క జేసీ ఫ్యామిలీకే సాధ్యం...మరోవైపు ప్రతిపక్ష నాయకుడిని కూడా పొగడడం జేసీ కుటుంబమే చేస్తుంది. అనంతపురం విషయానికి వస్తే, అక్కడ రాజకీయాలు వేరుగా ఉంటాయి.
 
ప్ర‌త్య‌ర్ధి పార్టీ నేత‌ల‌ను మాత్ర‌మే కాకుండా సొంత పార్టీ నేత‌ల‌ను సైతం లెక్క చేయ‌కుండా ఎవ‌రికి వారు రాజ‌కీయ ఎత్తుల‌ను కొన‌సాగిస్తుంటారు. ఒకే పార్టీలో ఉన్న ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికి మ‌ధ్య ఉన్న విభేదాల‌ను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. అయినప్పటికీ అనంతపురంను ఎప్పటి నుంచో జేసీ ఫ్యామిలీ శాసిస్తుంది.తాడిప‌త్రి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగుతున్నపెద్దారెడ్డి, పార్టీ అధిష్టానం కలిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు ర‌చిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ స్కెచ్ తో జేసీ ఫ్యామిలీకి బీటలు వాలే అవకాశం ఉంది...
 
అందులో భాగంగానే జేసీ ప్రధాన అనుచరుడు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించడంతో జేసీకి పెద్ద దెబ్బ తగిలింది అనే చెప్పాలి...ఈ మధ్య కాలంలో జేసీ బూతులు తిడుతూ ఉన్న వీడియోలు కూడా బయటపడడంతో ప్రజల్లో బాగా వ్యతిరేఖత పెరిగింది. జేసీ బస్సు ఉదంతంలో జగన్ చూపించిన చొరవతో అనంతపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి మరింత మైలేజీ వచ్చింది... ఇది కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశం...అనంతపురంలో కూడా జగన్ ప్రజాసంకల్ప యాత్ర అశేష జనవాహిని మధ్య జరిగింది...జేసీ ఫ్యామిలీపైన, టీడీపీపైన అంత వ్యతిరేఖత ఉంది కాబట్టే జనసంద్రోహం జగన్ ని చుట్టుముట్టింది అంటారు రాజకీయ విశ్లేషకులు...
 
అంతే కాకుండా తాడిప‌త్రిలో మ‌ద్యం దుకాణాల నిర్వ‌హ‌ణ పై పెద్దా రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. అనంత‌పురం, తాడిప‌త్రి, ధ‌ర్మ‌వ‌రం వంటి అనేక ప్రాంతాల్లో ఉన్న మ‌ద్యం దుకాణాల నిర్వాహ‌కుల‌కు, జేసీ కుటుంబానికి మ‌ధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాడిప‌త్రిలో మ‌హిళ‌ల‌కు ఇబ్బందిగా మారిన మ‌ద్యం దుకాణాల‌ను తీసివేయాలంటూ ధ‌ర్నాలు కూడా నిర్వ‌హించారు. 
 
అదే కాకుండా ఇక రానున్న రోజుల్లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్వ‌హిస్తోన్న కార్య‌కలాపాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి జేసీ ఫ్యామిలీ అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టే దిశ‌గా పెద్దా రెడ్డి  వ్యూహాలు ర‌చించ‌నున్నారు. దీంతో పాటు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజలకు తెలియజేస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ తన మైలేజీని కూడా పెంచుకుంటున్నారు...ఈ పరిణామాలతో వైసీపీ ముందుకు దూసుకెళ్తుంటే, టీడీపీ మాత్రం వెనక్కి వెళ్తుంది.. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన జెండా ఎగురవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.