జగన్ వెళ్లే దారితో చిక్కుల్లో టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:11:58

జగన్ వెళ్లే దారితో చిక్కుల్లో టీడీపీ

ప్రజల ఆరాధ్య దైవం మహా నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ప్రజల్లోకి చొచ్చుకొచ్చిన పేరు జగన్ మోహన్ రెడ్డి...నాటి నుండి నేటి వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదుగుతున్నారు. అధికార దాహంతో కాకుండా విశ్వసనీయతతో, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న దృఢ సంకల్పంతో వచ్చిన నాయడుకు జగన్ మోహన్ రెడ్డి...అందుకే 2014 ఎన్నికలలో ఒక వైపు టీడీపీ 600 తప్పుడు హామీలు ఇచ్చిన, రాష్ట్రా పరిస్థితులను పరిశీలిస్తే టీడీపీ ఇచ్చిన హామీలు అమలుచేయడం అసాధ్యం అని చెప్పి ఎన్నికలకు వెళ్లిన నాయకుడు జగన్.
 
అప్పటి నుండి మాట మీద కట్టుబడి ఉండే జగన్ ప్రత్యేక హోదా నుండి ప్రతీ అంశంలోనూ ఒకే మాట మీదవున్నారు...అదే మాట మీదే నాలుగేళ్ళ నుండి ప్రత్యేకహోదాపై అలుపెరుగని పోరాటం చేస్తుంది వైసీపీ...మొదటి నుండి ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, హోదా మనకు సంజీవని, ప్రత్యేక హోదా కోసం పార్టీలు అందరు ఏకమై పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చింది వైసీపీ...
 
ప్రధాని మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేస్తూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే, మన రాష్ట్రా ప్రభుత్వం దానిని అర్థరాత్రి మీటింగ్ పెట్టి మరి స్వాగతించింది...ఆరోజే జగన్ టీడీపీకి హెచ్చరించారు...ప్యాకేజీ తీసుకుంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితులలో ఉందొ అదే పరిస్థితిలో ఉంటుంది అందుకే కేంద్రంపై తిరగబడి బీజేపీ నుండి మీ మంత్రులను బయటకి తీసుకురండి, అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేస్తే ప్రత్యక హోదా వస్తుంది అని ప్రతిపక్ష నేత జగన్ మీడియా సాక్షిగా చంద్రబాబుకు చెప్పారు.
 
కానీ చంద్రబాబు మాత్రం ఓటుకు నోటు కేసు కోసం బయపడి, తన స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు...అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసి, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన, హోదా అంటే జైలుకే, హోదాతో ఎం ఒరుగుతుంది ఇలా రకరకాల మాటలతో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిపై విరుచుకుపడ్డారు...కానీ జగన్ మాత్రం రాష్ట్రా భవిష్యత్తుని మార్చే ప్రత్యేక హోదా అనే దారిని కన్నుకొని  మొదటి నుండి దాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు..
 
యువభేరీలు, దీక్షలు, బంద్ లతో ప్రత్యేక హోదాని ప్రజల నోట్లో నాణేల చేసారు ప్రతిపక్ష నేత...ప్రజలు కూడా ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవడంతో చంద్రబాబు కూడా నాలుగేళ్లు నుండి హోదా ఉసెత్తకుండా జగన్ దారిలోనే పయనించడానికి యూ - టర్న్ తీసుకోని హోదా కావాలి అన్నారు.. జగన్ కేంద్రంపై అవిశ్వాసం పెడితే, అవిశ్వాసం పెట్టాడు, వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేపించే సాహసం చేయలేకపోయారు...దింతో ప్రజలు బాబు నైజాన్ని అర్థ చేసుకున్నారు నాలుగేళ్ళ నుండి రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా ప్రత్యేక హోదాపైన చిత్తశుద్ధి ఉంటె తమ ఎంపీల చేత రాజీనామా చేపించేవారు బాబు స్వార్ధ రాజకీయం కోసం నాటకాలు ఆడుతున్నారు అని ప్రజలు గమనించారు...
 
వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తే టీడీపీ కనీసం మద్దతు కూడా తెలుపలేదు...హోదాపై యూ - టర్న్ తీసుకున్న పచ్చమీడియా చేత బాబుకే క్రెడిట్ దక్కేటట్టు చేద్దామనుకున్నాయి... కానీ వైసీపీ వేసిన ముళ్ళదారి రాజీనామాలు, దీక్షలతో టీడీపీ చిక్కులో పడింది...జగన్ ని అనుసరిద్దాం అనుకున్న బాబుకు జగన్ తెలివిగా చెక్ పెట్టడంతో ప్రజలు కూడా బాబుని యూ - టర్న్ అంకుల్ అంటున్నారు.. ఈ యూ - టర్న్ అంకుల్ జగన్ వెళ్లేదారిలోకి వచ్చి మధ్యలోనే ఇరుకొన్ని ఎటు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు...మరి చూడాలి 40 అనుభవం అడుగులు ఎటు వైపో...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.