టీడీపీ కోట‌లో వైసీపీ జెండా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-16 15:45:03

టీడీపీ కోట‌లో వైసీపీ జెండా

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు నాటి నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు టీడీపీకి కంచుకోటగా వ‌స్తున్న జిల్లా అనంత‌పురం జిల్లా. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు టీడీపీకి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. అనంత‌పురం అర్భ‌న్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఉన్నారు. కొద్దికాలంగా  న‌గ‌రంలో పాతూరు రోడ్డు విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ప్ర‌భాక‌ర్ కు ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిల మ‌ధ్య గొడ‌వ స్టార్ట్ అయింది. 
 
ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ  కొన్ని సంద‌ర్భాల్లో బ‌హిరంగంగానే ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఇక ఈ విష‌యంలో స్వ‌యానా చంద్ర‌బాబు నాయుడు జోక్యం చేసుకుని వీరిద్ద‌రికి స‌ర్ది చెప్పినా కూడా వీరికి కోపం చ‌ల్లార‌లేదు. ఇక ఇదే క్ర‌మంలో జేసీ, ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెట్ట‌డంతో వీరిద్ద‌రి వ్య‌వ‌హారం నిప్పు ఉప్పులా మారింది. దీంతో ప్ర‌జ‌లు కూడా కాస్త అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
అధికారంలో ఉండి కూడా ప్ర‌భాక‌ర్ జిల్లాలో ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం చేయ‌లేదు. అం