ఆ ఎమ్మెల్యేకు 2019లో తిరుగే లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-28 01:35:26

ఆ ఎమ్మెల్యేకు 2019లో తిరుగే లేదు

ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా నిలిచింది క‌ర్నూల్ జిల్లా. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల‌కు గాను 2014లో సార్వత్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని ఎదుర్కుంది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం మూడు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఈ జిల్లాలో పాగ వెయ్యాల‌ని చూస్తుంది.
 
ఇక ప్ర‌ధానంగా ఈ జిల్లాలోని ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే  2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గుమ్మ‌నూ జ‌య‌రాం త‌న ప్ర‌త్య‌ర్థిపై  పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక వ‌చ్చేఎన్నిక‌ల్లోకూడా ఈయ‌న వైసీపీ త‌ర‌పున‌ పోటీ చేసే ఆస్కారం క‌నిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి వీర‌భ‌ద్ర‌గౌడ్ , వైకుంటం మల్లికార్జున చౌద‌రి, మ‌సాల ప‌ద్మ‌జాలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చెయ్యాలి భావిస్తున్నారు. 
 
వీరంద‌రూ ఒకే పార్టీలో ఉన్నా కూడా విడి విడిగా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. త‌మ‌ను నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ త‌మ‌ను క‌లుపుకుని పోకున్నార‌ని మ‌ల్లికార్జున, ప‌ద్మ‌జా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో వీరభ‌ద్ర‌కు పార్టీత‌ర‌పున టికెట్ రాకుండా చేసేందుకు వీరంద‌రు ప‌రోక్షంగాప్ర‌య‌త్రిస్తున్నార‌ని వీర‌భ‌ద్ర అనుచ‌రులు మండిప‌డుతున్నారు. ఇక ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కోట్ల సుజాత‌మ్మ పోటీచేశారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని  తెలుస్తోంది. 
 
ఇక ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి ఆలూరు నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌గా ఫండ్స్ రాలేదు. దీంతో ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా అభివృద్ది కార్య‌క్రాలు చేయ‌లేక‌పోయారు. తాను ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేను కావ‌టంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అధికార నాయ‌కులు వివ‌క్ష‌త చూపుతున్నార‌ని, నిధులు లేక అభివృద్ది ఆగిపోయింద‌ని త‌రుచు విమ‌ర్శ‌లు చేస్తున్నారు జ‌య‌రాం. అయితే ఇదే క్ర‌మంలో ప్ర‌జ‌లు కూడా ఎమ్మెల్యే జ‌య‌రాం ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు   ప్ర‌జ‌ల‌కోసం నిరంత‌రం అధికార నాయ‌కుల‌ను క‌దిల‌స్తూనే వుంటార‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.