రాజంపేట‌లో వైసీపీ స‌రికొత్త వ్యూహ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 15:01:57

రాజంపేట‌లో వైసీపీ స‌రికొత్త వ్యూహ‌లు

ప్ర‌తిప‌క్ష‌వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట క‌డ‌ప‌జిల్లా లో వైసీపీ నాయ‌కులు స‌రికొత్త వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే అక్ష్యంగా చేసుకుని ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు బూత్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ క‌మిటీల‌ను నిర్వ‌హించ‌డంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఇప్ప‌టికే అన్ని మండ‌లాల్లో ఉన్న కార్య‌క‌ర్త‌ల‌తో వీరు స‌మావేశ‌మై వైసీపీ గెలుపుకోసం ప్ర‌తీ ఒక్క‌రు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు... అలాగే ఈ బూత్ కమిటీ కన్వీనర్స్ కు గుర్తింపు కార్డు,అభినందన పత్రం అందజేసిన అమ‌ర్నాథ్ రెడ్డి.
rajampeta
 
ఈ సంద‌ర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తీ బూత్ ల వారిగా కార్య‌క‌ర్త‌ల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని అన్నారు. అలాగే ప్ర‌తీ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఓట్లు ఏమైనా నమోదు చేయాలా అని వారు సూచించారు... ఏమైనా సమ‌స్య‌లు వ‌స్తే బూత్ లో కమిటీ తో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ycp
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల‌ని జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తేనే అన్ని రకాల వర్గాల ప్రజలకు మేలు జరుతుంద‌ని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయితే గ్రామ పంచాయతీ లో చదువుకున్న యువకులకు 10 మందికి ఉద్యోగులు కల్పిస్తార‌ని అన్నారు..అలాగే ఆయ‌న ప్ర‌క‌టించిన‌ నవరత్నలు గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత ప్ర‌తీ ఒక్క వైసీపీ కార్య‌క‌ర్త‌కు ఉంద‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.