మ‌రోసారి ప‌వ‌న్ కు వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 17:32:48

మ‌రోసారి ప‌వ‌న్ కు వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్

జ‌గ‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌శ్చిమ‌గోదావారి జిల్లా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను వ్య‌క్తిగతంగా విమ‌ర్శ‌లు చేస్తే త‌ట్టుకోలేర‌ని ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ బాబు మీడియా ద్వారా స్పందించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, నాలుగు సంవ‌త్స‌రాల‌పాటు టీడీపీతో భ‌జ‌న చేసిన ప‌వ‌న్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయల‌బ్ది పొందేందుకు మ‌చ్చ‌లేని త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గతంలో విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ నాయ‌కులు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున 150 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి  ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని చెప్పిన పవన్... ఆ తర్వాత ప్రత్యేక హోదాపై మాట్లాడటమే మానేశారని దుయ్యబట్టారు.
 
రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో త‌మ నాయకుడు నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని అలాంటి వ్య‌క్తిని విమ‌ర్శించే అధికారం ప‌వ‌న్ కు లేద‌ని ర‌మేష్ బాబు స్ప‌ష్టం చేశారు. ఇప్పుడుడిప్పుడు రాజ‌కీయాల్లోకి వచ్చిన ప‌వ‌న్ కు జ‌గ‌న్ గురించి ఏం తెలుస‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఇక నుంచి అయినా జ‌న‌సేన అధినేత ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే త‌గిన‌ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ర‌మేష్ బాబు హెచ్చ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.