వైసీపీ అవిశ్వాసం స‌క్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-16 18:03:13

వైసీపీ అవిశ్వాసం స‌క్సెస్

ఏపీకి ప్ర‌త్యేక హూదా పోరాటంలో భాగంగా నేడు కేంద్రం పై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెట్టారు. వైసీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స‌భ‌లో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ చ‌దివి వినిపించారు... అలాగే ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తెలుగుదేశం కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశపెట్టింది ఆ తీర్మానాన్ని కూడా చ‌దివారు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజన్.
 
స‌భ స‌జావుగా జ‌రిగే అవ‌కాశం లేద‌ని అన్నారు స్పీక‌ర్ అలాగే ఇటు వైసీపీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి తెలుగుదేశం త‌ర‌పున తోట న‌ర‌సింహం ఇచ్చిన నోటీసులు అందాయి అని ఆమె తెలియ‌చేశారు ఇద్ద‌రి నోటీసులు ఆమె స‌భ‌లో చ‌దివి వినిపించి, ఇద్ద‌రి నోటీసులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నాము అని అన్నారు... వెల్ లో ఉన్న స‌భ్యులు అంద‌రూ  వెన‌క్కి వెళ్లాలి అని ఆమె కోరారు.
 
ఇక విప‌క్షాల ఆందోళ‌న‌ల మ‌ధ్య చ‌ర్చకుద‌ర‌దు అని, స‌భ్యులు వెన‌క్కి వెళితే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఉందా లేదా అనేది చెప్ప‌గ‌లుగుతామ‌ని అన్నారు స్పీక‌ర్ ఇక ఈ ఆందోళ‌న‌ల మ‌ధ్య సోమ‌వారానికి స‌భ వాయిదా వేశారు స్పీక‌ర్. ఇటు వైసీపీ ముందుగానే ప‌లు జాతీయ పార్టీల‌ను అవిశ్వాసానికి మ‌ద్ద‌తు కోరింది కోరిన విధంగా కాంగ్రెస్, శివ‌సేన, తృణ‌ముల్, అన్నాడీఎంకేలు, స‌మాజ్ వాదీ పార్టీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ,ఏఏపీ, ఎస్పీ మ‌ద్ద‌తు తెలిపాయి.
 
స‌భ వాయిదా  త‌ర్వాత  మాట్లాడిన ఎంపీ  వైవి సుబ్బారెడ్డి బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఎలా అన్యాయం చేస్తుందో తెలుస్తోంది అని తెలియ‌చేశారు.....వెల్‌లోకి స‌భ్యులు వ‌చ్చిన‌పుడు చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు. హోస్  ఆర్డ‌ర్‌లో లేద‌ని ఎలా చెబుతారు అని ప్ర‌శ్నించారు వైవీ...రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా  క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్దం అన్నారు వైసీపీ ఎంపీలు.
 
హోదా సాధించేంత వ‌ర‌కూ మేం వెన‌క్కి తగ్గేది లేద‌ని ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి తెలియ‌చేశారు... హోదా విష‌యంలో చంద్ర‌బాబు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు... వైసీపీ త‌ర‌పున ఐదుగురు ఎంపీలు ఉన్నా, ఐదు కోట్ల మంది వాణి  మేం హ‌స్తిన‌లో వినిపించాం అని అన్నారు....చివ‌రి రోజు ఎంపీలంతా రాజీనామా చేస్తాం అని అన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.
 
అలాగే వైసీపీ ఎంపీ మేక‌పాటి మాట్లాడుతూ మాకు ప‌ద‌వులు కాదు,  రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం అని . చంద్ర‌బాబు తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నార‌ని విమ‌ర్శించారు.... ఏపీకి ప్ర‌త్యేక  హోదా పై గ‌తంలో చంద్ర‌బాబు ఎలా మాట్లాడారో అంద‌రికి తెలుసు అని గుర్తుచేశారు.... వైసీపీ యువ భేరికి యువ‌కులు ప్ర‌జ‌లు  వెళితే, వారిని  జైళ్ల‌లో పెడ‌తామ‌ని బెదిరించారు.మా ఆందోళ‌న‌ల‌ను, బంద్‌ల‌ను భ‌గ్నం చేసే ప్ర‌య‌త్నం చేశారు. హోదా పై  వైసీపీ మొద‌టి నుంచి పోరాటం చేస్తుంద‌ని తెలియ‌చేశారు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.