వామ‌ప‌క్షాల‌కు వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 06:10:35

వామ‌ప‌క్షాల‌కు వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న

కేంద్ర బ‌డ్జెట్ లో  ఎన్డీయే స‌ర్కార్ తెలుగు రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం అంద‌రికీ తెలుసు. ముఖ్యంగా బడ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయం దేశంలో ఏ రాష్ట్రానికి జ‌ర‌గ‌లేదు.ఏపీకి  ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న హామీలను విస్మ‌రించిన కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా  ఫిబ్ర‌వ‌రి 8న వామ‌ప‌క్షాలు బంద్ కు పిలుపునిచ్చింది. 
 
ఈ క్ర‌మంలో వామ‌ప‌క్షాల బంద్ కు ప్ర‌తిప‌క్ష  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌కటించింది.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగ్గరాజపట్నం, విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్యాక్టరీ సహా విభజనచట్టం ప్రకారం రావాల్సిన అన్ని అంశాలపైన తీరని అన్యాయం జరిగిందని.... ఈ క్రమంలో ఏ పార్టీ ఎలాంటి ఆందోళన చేపట్టినా వైఎస్సార్‌సీపీ మద్దుతు ఇస్తుందని పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి అనుగుణంగానే వామపక్షలు చేపట్టిన రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.