స‌ర్వే త‌ర్వాతే సీటు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 12:05:13

స‌ర్వే త‌ర్వాతే సీటు

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపుల‌కు మ‌రింత మేలు చేసే విధంగా ఏ విధ‌మైన ప్ర‌క‌ట‌న చేస్తారా అని... ఇటు తూ.గోలో ప‌.గోలో ప్ర‌జ‌లు ఎదురుచూశారు...ఇటు ప‌శ్చిమ‌లో ప‌లు సీట్ల పై జ‌గ‌న్ ఇప్ప‌టికే నాయ‌కుల‌ను అభ్య‌ర్దులను ప్ర‌క‌టించుకుంటూ వెళుతున్నారు..ముఖ్యంగా బీసీల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిథ్యం క‌ల్పిస్తామ‌ని చెప్పారు జ‌గ‌న్.అయితే పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ చెబుతున్న ప్ర‌క‌ట‌న‌లు హామీలు ఇటు ప్ర‌జారంజ‌క‌పాల‌న‌కు మార్గంగా ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తున్నాయి.
 
ముఖ్యంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో ప‌శ్చిమగోదావ‌రిజిల్లా, తూర్పుగోదావ‌రి జిల్లాలో బీసీల‌కు కాపుల‌కు అత్య‌ధిక సీట్లు ఇస్తాను అని ప్ర‌క‌ట‌న చేస్తున్నారు... అయితే బీసీ సామాజిక వ‌ర్గం ఇటు జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఆనందంతో ఉంది.. అలాగే రాజ‌మండ్రి సీటు పై కూడా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఆనందంగా ఉన్నారు బీసీ పెద్ద‌లు.
 
అయితే జిల్లాలో కాపు సెగ్మెంట్లు బీసీ సెగ్మెంట్ల‌లో వైసీపికి కీల‌క నాయ‌కులు ఉన్నారు.. వీరిని కాదు అని జ‌గ‌న్ వేరే వారికి కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌రు అనేది ఇక్క‌డ నాయ‌కుల వాద‌న.. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో త‌మ పేర్ల‌ను ప్ర‌క‌టిస్తే జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌కంటూ మ‌రింత ఫేమ్ వ‌స్తుంద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు ఉండ‌దు అని చెబుతున్నారు అభ్య‌ర్దులు.
 
అయితే పాద‌యాత్ర  ముగిసిన త‌ర్వాత కూడా ఇక్క‌డ ప్ర‌శాంత్ కిషోర్ టీం స‌ర్వే చేయ‌డంతో, ఆయా సెగ్మెంట్ల‌లో వైసీపీ త‌ర‌పున ఎవ‌రు అయితే గెలుస్తారు అనేది తెలియ‌చేస్తున్నారు..  ముఖ్యంగా వైసీపీ త‌ర‌పున సీట్లు స‌ర్వే ప్ర‌కారం వ‌స్తాయి అని ఇప్ప‌టికే ఓ వార్త వైర‌ల్ అవుతున్నా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల హవా బ‌ట్టీ వ‌స్తారు అని అంటున్నారు జిల్లాశ్రేణులు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.