వైసీపీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 16:31:37

వైసీపీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విభ‌జన చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేశారు.ఆ త‌ర్వాత కూడా విశాఖ‌ప‌ట్నం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు క‌లిసి వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే ఇదే క్ర‌మంలో ఈ నెల 30వ తేదీనా టీడీపీ కంచుకోటగా వ్య‌వ‌హ‌రిస్తున్న అనంత‌పురం జిల్లాలో వైసీపీ నాయ‌కులు క‌దం తొక్కి మ‌రోసారి కేంద్ర రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా న‌య‌వంచ‌న‌ దీక్ష‌ చేప‌డుతున్నామ‌ని వైసీపీ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ విశాఖ ప‌ట్నంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, పార్టీ నాయ‌కులు, ప్ర‌త్యేక హోదాకోసం రాజీనామా చేసిన‌ ఐదు మంది ఎంపీలు, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ అభిమానులంద‌రూ క‌లిసి ఈనెల 30వ తేదిన అనంత‌పురం ప‌ట్ట‌ణంలో ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయ‌త్రం వ‌ర‌కు న‌య‌వంచ‌న దీక్ష చేస్తామ‌ని బొత్స తెలిపారు. కాగా మొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నీతి అయోగ్ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీతో ఏం మాట్లాడారో మీడియాకు వివ‌రించాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ స‌వాల్ విసిరారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.