పోసాని అక్క‌డి నుంచే పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 15:39:13

పోసాని అక్క‌డి నుంచే పోటీ

ఏ విష‌యం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణముర‌ళి. ఈయ‌న 2019 ఎన్నిక‌ల‌కు సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు స‌మ‌యం ఉన్న సంద‌ర్భంలోనే త‌న ఓటు వైఎస్ జ‌గ‌న్ కు వేస్తాన‌ని భ‌హిరంగంగానే చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే పోసాని కృష్ణముర‌ళినే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గెలుపుకు మొద‌టి ప్ర‌టించి ఏపీ చ‌రిత్ర‌ను సృష్టించార‌నే చెప్పాలి. 
 
అయితే ఈ మ‌ధ్య కాలంలో వైఎస్ జ‌గ‌న్ అధికార‌మేల‌క్ష్యంగ‌గా చేసుకుని ప్ర‌జా సంకల్ప‌యాత్ర చేస్తున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావారి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాయాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళి, జ‌గ‌న్ ను క‌లుసుకుని ఆయ‌న‌తో పాటు సుమారు మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే తాను ఏదైతే చేస్తారో అదే ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారని అందుకే త‌న‌కు జ‌గ‌న్ అంటే అభిమాన‌మని పోసాని తెలిపారు. అలాగే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించారు. తాను వైసీపీ త‌ర‌పున 2019 ఎన్నిక‌ల్లో జ‌గన్ హామీ ఇస్తే క‌చ్చితంగా ప్ర‌చారం చేస్తాన‌ని, పోటీ చేయ‌న‌ని చెప్పారు. 
 
అయితే గ‌తంలో గుంటూరు జిల్లా చిల‌కలూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోసాని పోటీ చేశారు. అయితే, అక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత ప్ర‌త్తిపాటి పుల్లారావు హ‌వాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ తిరిగి సినిమాల‌పై దృష్టి సారించారు. అప్పుడ‌ప్పుడు జ‌గ‌న్ కు స‌పోర్ట్ చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ఆయ‌న కుమారుడుపై ప్ర‌త్య‌క్షంగా లేక ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసేవారు. 
 
ఇక ఆయ‌న చురుకుత‌నాన్ని చూసి జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. పోసాని గుంటూరు జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువగా ఉన్న నియోజ‌కవ‌ర్గంలో పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ చూస్తున్నార‌ట‌. అలాగే ఆయ‌న‌కు ఉన్న స్టార్ ఇమేజ్ కూడా వైసీపీ గెలుపుకు హెల్ప్ అవుతుంది అని జగన్ భావిస్తున్నార‌ని తెలిసింది. ఇక మ‌రికొంద‌రు అయితే ఎక్క‌డైతే పోసాని ఓడిపాయారో అక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని అప్పుడే మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు చెక్ పెట్టొచ్చ‌ని భావిస్తున్నారు. 
 
పైగా ఈ నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌త్తిపాటి మంత్రి ప‌ద‌విలో ఉండి కూడా చిల‌కలూరి పేటలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోసానినే ఈ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేయిస్తే క‌చ్చితంగా గెల‌వ‌డం ఖాయం అని భావిస్తున్నారు. అయితే జ‌గ‌న్ కూడా ఆ విష‌యంపై ఆలోచిస్తున్నార‌న‌ట‌. ఇందుకోసం ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ తో కూడా చిల‌కలూరి పేటలో స‌ర్వే చేయించార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.