సర్వేల్లో వైసీపీనే టాప్..చంద్రబాబు కి దిమ్మ తిరిగే షాక్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-09 03:07:16

సర్వేల్లో వైసీపీనే టాప్..చంద్రబాబు కి దిమ్మ తిరిగే షాక్...

రాజకీయ నాయకులు ఈ మధ్య తమకేది అనుకూలంగా ఉంటే దాన్నే సపోర్ట్ చేస్తున్నారు.. ముఖ్యంగా అధికారం లో ఉన్న టీడీపీ ప్రభత్వం తమకు అనుకూలంగా, నచ్చేవి మాత్రమే తీసుకుని వ్యతిరేకంగా ఉన్నవారిని దూరం పెడుతూ వాటిపై విమర్శలు పెడుతున్నారు. తాజాగా సి సర్వే లో వచ్చిన ఫలితాలు తమకు అనుకూలంగా లేవని ఆ సర్వే పై దుమ్మేత్తే ప్రయత్నం చేస్తున్నారు..పార్టీ మీటింగ్ లో చంద్రబాబు అదసలు సర్వే నే కాదని, ఇలాంటి దొంగసర్వేలూ చేసే వారికి నేను భయపడను అంటే అయన తోకలు మరో అడుగు ముందుకేసి అది వైసీపీ సర్వే అని, బిజెపి దగ్గరుండి చేయించిన సర్వే అని వంతపాడుతున్నారు.. 
 
ఇంతకీ ఆ సర్వే లో వచ్చిందేంటంటే ఏపీకి సంబంధించి చూస్తే వైసీపీకి మొత్తం పాతిక ఎంపీ సీట్లకు గాను ఇరవై ఒకటి వస్తాయని తేల్చింది. అదే సర్వే దేశవ్యాప్తంగా బీజేపీకి సీట్లు బాగా తగ్గుతాయని చెప్పుకొచ్చింది. ప్రాంతీయ పార్టీల బలాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేసింది. దాన్ని పట్టుకుని వీళ్ళు బిజెపి దగ్గరుంచి చేయించిన సర్వే, వైసిపి వెన్కలనుండి చేయించిన సర్వే అని చెప్తున్నారు.. ఒకవేళ బిజెపి చేయించిన సర్వే అయితే సీ ఓటర్ సర్వే నిజానికి చెప్పిందేమిటి, కేంద్రంలో మోడీ సర్కార్ కి సొంతంగా మెజారిటీ రాదని కదా... పైగా బీజేపీ యూపీలో సీట్లను బాగా కోల్పోతుందని కూడా చెప్పుకొచ్చింది. 
 
మరి అది బీజేపీ సర్వే అయితే తమ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఎక్కడైనా చెప్పుకుంటారా. ఇక దొంగ సర్వే అంటున్న బాబు తో సహా టీడీపీ నేతలు ఇవే సర్వేలను ఆధారం చేసుకునే కదా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోతుందని, కేంద్రంలో మళ్ళీ మోడీ రాడని డబ్బా కొడుతున్నారు. అదే పరిస్థితిలో వైసిపి కి అన్ని సీట్లు రావడం టీడీపీ కి రుచించట్లేదు.. అందుకు తమకు కావాల్సిన దాన్ని తీసుకుని మిగితాడాన్ని దొంగ సర్వేలు అని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. నిజానికి ఈ సర్వేలనే కదా టీడీపీ అనుకూల మీడియా పెద్ద అక్షరాలతో భారీ హెడ్డింగుల్లో అచ్చేసింది. ఏపీ విషయానికి వస్తే మాత్రం ఆ సర్వే భోగస్, తప్పుల తడక అయిందా. ఈ లాజిక్ ని టీడీపీ మిస్ చేసినా జనాలు బాగానే అర్ధం చేసుకుంటున్నారు.. మొత్తానికి వైసిపి కి భారీ అనుకూలత రావడం టీడీపీ కి నచ్చడంలేదు అని ఈ విషయం తో అర్థమైపోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.