అక్క‌డ టీడీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వనున్న వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp
Updated:  2018-09-18 12:14:10

అక్క‌డ టీడీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వనున్న వైసీపీ

విశాఖ జిల్లాలోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గం అంటేనే గుర్తుకు వ‌చ్చేది కుల రాజ‌కీయాలు. అభ్య‌ర్ధి ఎవ‌రు అయినా స‌రే తమ కుల‌స్తుడు పోటీ చేస్తే చాలు క‌ళ్లు మూసుకుని ఓట్లు వేస్తారు ఇక్క‌డ ప్ర‌జ‌లు. ధ‌నిక నియోజ‌క‌వ‌ర్గంగా గుర్తింపు ఉన్న గాజువాక‌లో కాపు, యాద‌వులు, ఎస్సీ, గ‌వ‌ర‌, రెడిక‌, మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. అయితే వీరిలో కాపులు, యాద‌వులే ప్ర‌ధానంగా గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తాయి.
 
విశాఖ స్టీల్ ప్లాంట్, గంగ‌వ‌రం పోర్ట్, బీహెచ్ పీవీ, విశాఖ సెజిలైతోపాటు పారిశ్రామిక ప్ర‌గ‌తి కేంద్రంగా ఉండే గాజువాక‌ లో ఇత‌ర ప్రాంతాల‌ నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డినవారే ఎక్కువ. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2009లో ప్ర‌జారాజ్యం పార్టీనుంచి చితంల‌పుడి వెంక‌ట‌రామ‌య్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్ లో విలీనం కావ‌టం, విభ‌జ‌న ప్ర‌భావం ఆ పార్టీపై తీవ్రంగా ఉండ‌టంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చింత‌ల‌పుడి 2014లో పోటీ చెయ్య‌లేదు.
 
దీంతో ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ, టీడీపీలు పోటీ చేశాయి. ఇక ఈ పోటీలో టీడీపీ త‌ర‌పున ప‌ల్లా శ్రీనివాస్ పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌వ‌న్ క‌ళ్యాన్ పొత్తులో భాగంగా యాద‌వ కాపు మ‌త్స్య‌కార ఓట‌ర్ల కాంబినేష‌న్ టీడీపీకి క‌లిసి రావ‌డంతో ఆయ‌న గెలిచారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో గెలుపే ల‌క్ష్యంగా చేసుకుని శ్రీనివాస్ ప్ర‌జ‌ల‌కు అనేక హామీల‌ను ఇచ్చారు. అయితే ఆయ‌న ఎమ్మెల్యే అయిన త‌ర్వాత ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్నచందంగా మారింది గాజువాక ప‌రిస్థితి. 
 
2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ప‌ల్లా శ్రీనివాస్ మొద‌టిలో కుటుంబ ఒత్తిడిలు, ద్వితియ శ్రేణినాయ‌క‌త్వం అల‌క‌లు వంటి స‌మ‌స్య‌లను ఎక్కువ‌గా ఉండ‌టంతో అక్క‌డి ప‌రిస్ధితి పూర్తిగా మారిపోయింది. ఇక గాజువాకలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క‌న్విన‌ర్ నాగిరెడ్డికి ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌నుంచి మంచి స్పంద‌న ఉంది. ఈయ‌న వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోవ‌డంతో ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి ఎక్కువ‌గా ఉంది. ఇక ఇదే క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి వైసీపీలో చేరండంతో వైసీపీకి పూర్తిగా ప్ల‌స్ అయింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.