వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 13:45:21

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో మొద‌లైంది... ఈ యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఒక్కొక్క‌టి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ, వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకుసాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌న ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా నేడు కృష్ణా జిల్లా చిట్టిన‌గ‌ర్ లోబ‌హిరంగ స‌భ‌ను నిర్వ హించ‌నున్నారు.. జ‌గ‌న్ ఇక్క‌డ భ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌కూడ‌దు అనే ఉద్దేశ్యంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు చిట్టిన‌గ‌ర్ లో ఏర్పాటు చేసిని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల‌ను అధికార బ‌లంతో తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు...ఈ స‌మాచారాన్ని తెలుసుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఫ్లెక్సీల‌ను ఎందుకు తొల‌గిస్తున్నార‌ని వారికి అడుగ‌గా త‌న నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు సంద‌ర్భంగా ముందురోజు వేడుక‌ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని టీడీపీ నాయ‌కులు చెప్పకొచ్చారు.
 
ఈ స‌భ‌కు ముఖ్య అతిదిగా విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్  విచ్చేయ‌నున్నార‌ని టీడీపీ నాయ‌కులు తెలిపారు... దీంతో అక్కడ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.. ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు రంగంలోకి దిగి  టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.. ఈ సంద‌ర్భంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు మాట్లాడుతూ... ఇదంతా కావాల‌నే జ‌లీల్ ఖాన్ చేయిస్తున్నార‌ని, చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఈ నెల 20వ తేది అని, కానీ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన యాత్ర‌ను ఏదో ఒక సాకుతో అడ్డుకోవాల‌నే ఉద్దేశ్యంతో చేస్తున్నార‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు.. జ‌లీల్ ఖాన్ నిన్న చేసిన వ్యాఖ్య‌ల‌కు ఈ రోజు చిట్టిన‌గ‌ర్ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ అత‌ని అవినీతి బండారం, ప‌రిపాల‌న బ‌య‌ట‌పెడుతార‌నే భ‌యంతో ఈ డ్రామా ఆడుతున్నార‌ని మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.