వైసీపీ నాయకుడు దారుణ‌ హత్య ప‌రిటాల అనుచరులు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp murder siva reddy image
Updated:  2018-03-31 12:54:47

వైసీపీ నాయకుడు దారుణ‌ హత్య ప‌రిటాల అనుచరులు ?

అనంత‌పురం జిల్లాలో వైసీపీ కార్య‌క‌ర్త శివారెడ్డి దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. అనంత‌పురం రూరల్ మండలం కందుకూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రత్యర్థులే ఆయన్ని హతమార్చి ఉంటారని వారికుటుంబ స‌భ్యులు ఆరోపించారు.
 
ఈ స‌మ‌యంలో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి ప‌రిటాల ఫ్యామిలీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.. రాప్తాడు సెగ్మెంట్లో త‌మ‌కు తిరుగు ఉండ‌కూడ‌దు అనే ఉద్దేశ్యంతో ప‌రిటాల కుటుంబం ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు... వైసీపీ త‌ర‌పున గ్రామాల్లో ఉండే నాయ‌కులను టార్గెట్ చేస్తున్నార‌ని, వారిని హ‌త్య‌లు చేసి రాజ‌కీయాలు చేస్తున్నారు అని ఆరోపించారు. శివారెడ్డి హత్య కూడా అలాంటిదేనని అన్నారు. కందుకూరు గ్రామంలో శివారెడ్డి సొంతంగా త‌న డ‌బ్బుతో వాట‌ర్ ట్యాంకుల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు అని జ‌నానికి ద‌గ్గ‌ర అవుతున్న స‌మ‌యంలో ఎదుర్కోలేక ఇటువంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ్డారని విమ‌ర్శిస్తున్నారు.
 
శివారెడ్డి త‌న‌యుడు భానుప్ర‌కాశ్ తో క‌లిసి పొలం ప‌నికి వెళ్తున్న స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌లు బాలకృష్ణ, విక్రమ్‌లు వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు... కుమారుడ్ని కూడా చంపుదామ‌ని ప్ర‌య‌త్నిస్తే ప‌క్క పోలం వారు రావ‌డంతో హంత‌కులు పారిపోయార‌ని గ‌తంలో కూడా తెలుగుదేశం నేత‌ల‌తో శివారెడ్డికి వివాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది....శివారెడ్డిని చంపింది ప‌రిటాల శ్రీరాం అనుచ‌రులే అని అంటున్నారు కుటుంబ స‌భ్యులు..
 
హంతకుడు బాలకృష్ణ పరిటాల శ్రీరాంతో సన్నిహితంగా దిగిన ఫొటోలను కూడా విడుదల చేశారు. శివారెడ్డి హత్య వెనుక పరిటాల శ్రీరాం హస్తముందని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు బాలకృష్ణ, విక్రమ్‌తో పాటు పరిటాల శ్రీరామ్‌పైనా శివారెడ్డి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హంతకులు బాలకృష్ణ, విక్రమ్‌లు ముందు పరిటాల శ్రీరామ్‌, మహేంద్రను సంప్రదించారని వారు ఇచ్చిన అండతోనే హత్యకు తెగబడ్డారని శివారెడ్డి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హంతకులను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అని వారు విమర్శిస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.