వైసీపీ ఎమ్మెల్యే దీక్ష‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla
Updated:  2018-06-19 04:53:04

వైసీపీ ఎమ్మెల్యే దీక్ష‌

ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివప్రసాదరెడ్డి క‌డ‌ప ఉక్కు సాధ‌న‌కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి గురువారం ఉద‌యం వ‌ర‌కు తాను పుట్ట‌ప‌ర్తిలో దీక్ష చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ దీక్ష చేసే ముందు పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ర్యాలీగా వెళ్లి రామేశ్వరం రోడ్డు, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్‌ సర్కిల్ కు చేరుకుంటామ‌ని ఆ త‌ర్వాత పుట్ట‌ప‌ర్తిలో దీక్ష చేస్తాన‌ని శివప్రసాదరెడ్డి తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, నాలుగు సంవ‌త్స‌రాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తునే ఉన్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి లాలూచీ చేయ‌డం వల్ల‌  విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌తో పాటు ఉక్కు పరిశ్రమ విష‌యంలో కూడా డ్రామాలు ఆడుతున్నార‌ని శివ‌ప్ర‌సాద్ రెడ్డి మండిప‌డ్డారు. 
 
అయితే తాను పుట్ట‌ప‌ర్తిలో చేప‌ట్ట‌బోయే ఈ దీక్ష‌కు అధిక సంఖ్య‌లో మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆయ‌న సూచించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో వామ‌ప‌క్ష సీపీఐ, సీపీఎం, పార్టీల‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంద‌రు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని శివ‌ప్ర‌సాద రెడ్డి తెలిపారు. అలాగే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్లు దీక్షలో పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు పలకనున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.