సీఎం ర‌మేష్ పై ఆస్ధాన మీడియా టార్గెట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yello media new strategies on cm ramesh
Updated:  2018-03-03 11:29:42

సీఎం ర‌మేష్ పై ఆస్ధాన మీడియా టార్గెట్ ?

        సీఎం ర‌మేష్ తెలుగుదేశంలో ఆర్దిక పిల్ల‌ర్ గా చెబుతారు.. ఆయ‌న్ని రాజ్య‌స‌భ‌కు పంపి బాబు పార్టీలో ఓ కీల‌క నాయ‌కుడిగా చేసుకున్నారు.. గత ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం విజ‌యం సాధించింది అంటే సీఎం ర‌మేష్ హ్యాండ్ ఉంది అనే చెప్పాలి... అయితే గెలిచిన త‌ర్వాత ఫిరాయింపు నాయ‌కులు పార్టీలో చేరి సీఎం ర‌మేష్ ని ప‌క్క‌న పెట్టారు.. క‌రివేపాకు ఫార్మూలా అమ‌లు ప‌రిచారు.. ఇక కాంట్రాక్టులు ప‌నుల‌తో బిజిగా ఉన్న సీఎం ర‌మేష్ త‌దుప‌రి ఈ నాలుగు సంవ‌త్స‌రాలుగా రాయ‌ల‌సీమ జిల్లాల్లో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక కేడ‌ర్ ను నిల‌బెట్టుకోలేదు అనే చెప్పాలి.
 
ఇక ఈ ఆరేళ్ల ప‌ద‌వి కాలం మ‌రి కొద్ది రోజుల్లో పూర్తి కానుంది.. రాజ్య‌స‌భ ప‌ద‌వి నుంచి ఆయ‌న వైదొల‌గునున్నారు కొత్త స‌భ్యులు వెళ్ల‌నున్నారు. అయితే.. మ‌ళ్లీ రాజ్య‌స‌భ రేసులో సీఎం ర‌మేష్ అంటూ పేర్లు వినిపించాయి.. అన్ని గాలి వార్త‌లు అని కొట్టిపారేసింది తెలుగుదేశం పార్టీ.. మ‌ళ్లీ సీఎం ర‌మేష్ కు ఛాన్స్ ఇవ్వ‌డం లేదు అని అన్నారు కొంద‌రు సీనియ‌ర్లు.
 
 తాజాగా సీఎం ర‌మేష్ పై సైకిల్ పార్టీ ఆస్దాన‌మీడియా కూడా ఘాటుగా వార్త‌లు రాస్తోంది.. సీఎం చంద్ర‌బాబు మాటే శిరోధార్యం అని ప్ర‌త్యేక హూదా ఉద్య‌మంలో సీఎం ర‌మేష్ పాత్ర‌లేదు అనేలా జిల్లా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నార‌ని వెల్ల‌డించింది.ఆరేళ్ల పదవీ కాలంలో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌లేదు అని తేల్చేసింది. ఇక ఏప్రిల్ 2 న ముగియ‌నున్న సీఎం ర‌మేష్ ప‌ద‌వి పై ఆస్దాన మీడియా ఈ అభ్య‌ర్దుల ఎంపిక స‌మ‌యంలో ఎందుకు రాసిపెట్టుకుంది అంటే?  అదే బాబు రాజ‌కీయం అంటున్నారు సీనియ‌ర్లు.
 
కావాల‌నే ఇక్క‌డ సీఎం ర‌మేష్ కు సీటు లేదు అనేలా ప‌లుకార‌ణాలు చూపి సెంట‌ర్ చేసింది ర‌మేష్ ని.. మొత్తానికి మొన్న మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్య‌వ‌హారం సీఎం ర‌మేష్ కు కాస్త ఇబ్బందికి గురిచేసింది. త‌న కంపెనీకి కాంట్రాక్టులు ద‌క్క‌కుండా జిల్లా నాయ‌కులు అడ్డుత‌గిలారు.. ఇప్పుడు ప‌దవి లేక‌పోతే త‌న ప‌రిస్ధితి ఏమిటి అని సీఎం ర‌మేష్ కూడా ఆలోచ‌న‌లో ఉన్నారు. అదే స‌మ‌యంలో ప్రొద్దుటూరు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌పున ఖ‌ర్చుతానే పెట్టుకుని నిల‌బ‌డ‌తాను అని చెప్పారు.. అయినా అక్క‌డ చాలా మంది సైకిల్ పార్టీ అభ్య‌ర్దులుగా ఉన్నారు. అక్క‌డ కూడా సీఎం ర‌మేష్ కు మెండి చెయ్యి చూపిస్తున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.