వైసీపీకి మూడు ల‌క్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 12:04:02

వైసీపీకి మూడు ల‌క్ష‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తోంది.సుమారు మూడు ల‌క్ష‌ల మంది బ్రిడ్జ్ పై నుంచి జ‌న‌నేత పాదయాత్ర‌కు వ‌చ్చారు అని, ఇంటిలెజెన్స్ రిపోర్ట్ కూడా చెబుతోంది.రాజకీయంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆద‌రించ‌క‌పోయినా, ఇప్పుడు జ‌న‌నేత‌కు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు..వైసీపీ అధినేత పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో అశేష జ‌న‌వాహిని మ‌ధ్య కొన‌సాగుతోంది.. జిల్లాలో ముఖ్య నాయ‌కులు అంద‌రూ జ‌గ‌న్ తో క‌లిసి క‌దం తొక్కుతున్నారు..
 
అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర ఎంత ప‌చ్చ‌మీడియా చూపించ‌కూడ‌దు అనుకున్నా చివ‌ర‌కు చూపించ‌వ‌ల‌సి వ‌చ్చింది.. సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ కు విశేషంగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది..ఇక అన్నీ మీడియాలు గోదావ‌రి ద‌గ్గ‌ర కెమెరాలు డ్రోన్లతో జ‌న గోదావ‌రిని జ‌నానికి చూపించారు..
 
అఖండ జ‌న సందోహంలో జ‌గ‌న్ రైల్ కం ఓవ‌ర్ బ్రిడ్జ్  మీదుగా పాద‌యాత్ర చేశారు.. జిల్లా నాయ‌కులు పెద్ద ఎత్తున త‌ర‌లి రావ‌డంతో వైసీపీ నాయ‌కులు కూడా ఊహించ‌ని జ‌నం అక్కడ సాక్షాత్కార‌మ‌య్యారు.. అయితే సుమారు మూడు ల‌క్ష‌ల మంది జ‌నం వ‌చ్చి ఉంటార‌ని ఇంటెలిజెన్స్ అంచ‌నా వేయ‌డంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప‌రిస్దితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా త‌యారైంది.
 
ఇంత మంది జ‌నాన్నిచూసిన జిల్లా నాయ‌కులు, జ‌గ‌న్ పై ఎటువంటి కామెంట్లు చేయ‌లేదు. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌లేదు.జిల్లాలో బీసీ, కాపు సెగ్మెంట్లు, ద‌ళిత యువ‌త పెద్ద ఎత్తున పాద‌యాత్ర‌కు వ‌చ్చారు అని ఇంట‌ర్న‌ల్ గా సైకిల్ పార్టికి స‌మాచారం అందింద‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.