పచ్చ ప్రచారానికి సమాధానం ఇదిగో...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 03:39:52

పచ్చ ప్రచారానికి సమాధానం ఇదిగో...

అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా అభిమానులు రోజు రోజుకూ దిగజారి పోతున్నారు. ఇటీవల పాదయాత్రలో ఓ వ్యక్తి చనిపోతే కనీసం చూడడానికి కూడా జగన్ వెళ్లలేంటూ పచ్చ బ్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ ప్రచారానికి సమధానంగా వైయస్ జగన్ మరణించిన వ్యక్తి దగ్గరకికి వెళ్లిన వీడియోను చూపించి తెలుగు తమ్ముళ్ల చెంప చెళ్లుమనిపించేలా చేసింది మీ జనహితం. ఇప్పుడు పచ్చ బ్యాచ్ విజయసాయి రెడ్డి మీద పడింది. స్వరూపానందేంద్ర స్వామి వారి సమక్షంలో బీజేపీ నేత సోము వీర్రాజు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రహస్య సమావేశం నిర్వహించినట్లు ఓ ఫోటోతో విష ప్రచారం మొదటుపెట్టింది.

వారిద్దరు ఉన్న ఆ ఫోటో మాత్రం అక్షరాల నిజమే..ఎలాంటి మార్పింగ్ లేదు....అయితే తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా రహస్య సమావేశం కాదు..బహిరంగ సమావేశమే. గతంలో స్వామి జన్మదిన వేడుకలకు వెళ్లినపుడు తీసిన ఫోటో. అప్పుడు వారిద్దరే కాదు..వైసీపీ ఎమ్మెల్యే రోజా,హరిబాబు, కళా వెంకట్రావ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

అసలు విషయాన్ని దాచేసి బీజేపీతో విజయసాయి రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తప్పుడు వార్తలను తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసి మరో సారి వారి వక్రబుద్దిని బయటపెట్టుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.